Begin typing your search above and press return to search.
ఆరోగ్యశ్రీలో కులగజ్జి.. వైసీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
By: Tupaki Desk | 17 March 2020 10:57 AM ISTఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రద్దు వేడి రాజేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నిర్ణయంపై అధికార వైసీపీ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేయడం ఇది చంద్రబాబు-రమేశ్ కుమార్ కుట్ర అంటూ ఇప్పటికే సీఎం జగన్ ఆడిపోసుకున్నారు. కులగజ్జి కారణంగానే బాబు-రమేశ్ కుమార్ ఒక్కటయ్యారని జగన్ ఆరోపించారు.
జగన్ బాటలోనే ఇప్పుడు వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు సైతం ఎన్నికల అధికారి రమేశ్ కుమార్ పై నిప్పులు చెరిగారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తాజాగా ఎన్నికల కమిషనర్, చంద్రబాబు పై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
కులగజ్జి కారణంగానే ఎన్నికల కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని ఎమ్మెల్యే పిన్నెల్లి ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి తక్షణమే కులగజ్జిని చేర్చి చికిత్స అందించాలని రాష్ట్రం మరింత నష్ట పోయే ప్రమాదం ఉందని సంచలన కామెంట్స్ చేశారు.
స్థానిక సంస్థలకు 5వేల కోట్ల నిధులు రాకుండా రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవాలన్న భావనతోనే ఎన్నికలను తన కులస్థుడైన రమేశ్ కుమార్ తో చంద్రబాబు ఆపించారని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆరోపించారు. స్వయం ప్రకాశం లేని అమావాస్య చంద్రుడికి మొదటి నుంచి భయమేనని పిన్నెల్లి విరుకుపడ్డారు. చంద్రబాబు తన జీవితంలో ఒక్కసారే పొత్తు లేకుండా గెలిచాడని ఎద్దేవా చేశారు.