Begin typing your search above and press return to search.

మహిళా ఎంపీడీవోపై వైసీపీ ఎమ్మెల్యే దాడి

By:  Tupaki Desk   |   5 Oct 2019 11:38 AM IST
మహిళా ఎంపీడీవోపై వైసీపీ ఎమ్మెల్యే దాడి
X
నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేసినట్టు తెలిసింది కల్లూరిపల్లిలోని ఇంటికి వచ్చి హంగామా చేశారని ఎంపీడీవో సరళ ఆరోపించారు. ఓ లేఅవుట్ కు అనుమతులు ఇవ్వనందుకే ఈ దాడి చేశారని ఆమె విమర్శించారు. ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపి వేసి.. నీటి పైపులైన్ కూడా ధ్వంసం చేశారని ఎంపీడీవో ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ వైర్ సైతం కట్ చేశారని వాపోయారు..

కాగా వైసీపీ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎంపీడీవో సరళ స్థానిక వెంకటాచలం పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ ఒక్క కానిస్టేబుల్ మాత్రమే ఉండడంతో పోలీసులు ఎమ్మెల్యేకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. సీఐ లేదా ఎస్సై వచ్చేదాక ఇక్కడే ఉంటానని నిరసన తెలిపారు.

ఎంపీడీవోపై ఎమ్మెల్యే దాడిని అధికారులు ఖండించారు. గ్రామ కార్యదర్శులు ఆమెకు సంఘీభావం తెలిపారు.ఈ గొడవపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాత్రం ఇంతవరకూ స్పందించలేదు.