Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేకు ప‌రాభావం.. రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   6 March 2022 9:29 AM GMT
వైసీపీ ఎమ్మెల్యేకు ప‌రాభావం.. రీజ‌న్ ఇదే!
X
అధికార పార్టీ ఎమ్మెల్యేల‌కు ప‌లు చోట్ల ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఇటీవ‌ల చిత్తూరు జిల్లాలో న‌గ‌రి ఎమ్మెల్యే రోజాకు పెద్ద ప‌రాభ‌వ‌మేఎదురైంది. ఆమె నిర్వ‌హించిన‌.. మీ ఎమ్మెల్యే మీ కోసం.. కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల‌ను క‌లిసేందుకు వెళ్ల‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లు ఓటీఎస్‌పై నిల‌దీశారు. దీంతో స‌మాధానం చెప్పుకోలేక కార్య‌క్ర‌మాన్ని మ‌ధ్య‌లోనే వాయిదా వేసుకుని వ‌చ్చేశారు. త‌ర్వాత‌.. ఇదే జిల్లా ప‌ల‌మ‌నేరులోనూ.. ఎమ్మెల్యే వెంక‌టే గౌడ్‌కు కూడా ప‌రాభ‌వం ఎదురైంది.

త‌మ‌ను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తీసేశారంటూ.. వ‌లంటీర్లు పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఇంటింటికీ ఎమ్మెల్యే కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేసుకుని వెన‌క్కి వెళ్లిపోయారు. ఇక‌, ఇప్పుడు తాజాగా.. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం గంటిపెదపూడిలో వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు పరాభవం ఎదురైంది. చిట్టిబాబును ఉచ్చులవారిపేట గ్రామస్థులు అడ్డుకుని కొన్నేళ్లుగా తాము పడుతున్న బాధలను వివరించి, వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు.

ఈ క్ర‌మంలో త్వరలోనే లంకగ్రామాలకు వంతెన వస్తుందని, పంటకాలువపై కూడా వంతెన నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు. కానీ, ఆ వంతెన ఎప్పుడు వస్తుందోనని, తమకు ప్రత్యేకంగా వంతెన కావాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తంచేసి వంతెన అవ్వదని చెప్పడంతో, అయితే వెళ్లిపోండంటూ ఆయనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుతిరిగారు.

గంటిపెదపూడి శివారు ఉచ్చులవారిపేటలో శ్మశానవాటికకు గ్రామస్థులు వెళ్లాలంటే తెప్పల సాయంతో పంట కాలువ దాటాల్సిందే. ప్రభుత్వాలు మారినా వంతెన నిర్మాణం ఎన్నికల వాగ్దానంగానే మిగిలిపోతోం ది. ఈ క్రమంలో ఇప్పుడు ఆయ‌న‌కు సెగ త‌గిలింది. అయితే.. ఇలా ఎందుకు జ‌రుగుతోంది? అధికార పార్టీ ఎమ్మెల్యేల‌పై ఎందుకు కేవ‌లం రెండున్న‌రేళ్ల కాలంలోనే ఇంత వ్య‌తిరేక‌త వ‌చ్చింది? అనేది చ‌ర్చ‌కు దారితీస్తోంది. దీనిని ఒకింత లోతుగా ప‌రిశీలిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డా అభివృద్ధి లేక పోవ‌డం.. ప్ర‌ధానంగా క‌నిపిస్తోంది.

అదేస‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ ఓవ‌రాల్‌గా.. తాను ఇచ్చిన మేనిఫెస్టో మేర‌కు కార్య‌క్ర‌మాలు, సంక్షేమం అమ‌లు చేస్తున్నా.. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అనేక హామీలు ఇచ్చారు. స్థానికంగా ద‌శాబ్దాల త‌ర‌బ‌డి.. ప‌రిష్కారానికి నోచుకోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని.. ర‌హదారులు వేయిస్తామ‌ని.. కుళాయి సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని.. హామీలు ఇచ్చారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేలు ఇలాంటి చర్య‌లు తీసుకోలేదు.

దీంతో ప్ర‌జ‌ల్లో అస‌హ‌నం పెల్లుబుకుతోంది. పోనీ.. ఎమ్మెల్యేల‌కు చేయాల‌ని ఉన్నా.. చేసేందుకు ప్ర‌భు త్వం నుంచి ఎలాంటి నిధులూ వారికి అంద‌డం లేదు. 2019లో ప్రారంభ‌మైన జ‌గ‌న్ పాల‌న‌లో తొలి అసెం బ్లీలో ఆయ‌న ప్ర‌తి ఎమ్మెల్యేకూ.. కోటి రూపాయ‌ల చొప్పున ఇస్తాన‌ని.. వాగ్దానం చేశారు. అయితే.. కోటి మాట దేవుడెరుగు క‌నీసం నియోజ‌క‌వ‌ర్గానికి నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు కూడా ఇవ్వ‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ క్ర‌మంలో నే అదికార పార్టీ ఎమ్మెల్యేల‌కు ఎక్క‌డిక‌క్క‌డ నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతుండ‌డంగ‌మ‌నార్హం.