Begin typing your search above and press return to search.

కలెక్టర్ పై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   13 March 2021 9:08 PM IST
కలెక్టర్ పై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X
అనంతపురం జిల్లా కలెక్టర్ చంద్రుడుపై ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. 'అహంకారపూరితమైనటువంటి.. ఒక ఇగోయిస్ట్ కలెక్టర్ గంధం చంద్రుడి ఒక అవమానకరమైన నిర్ణయం వల్ల 800 జనాభా ఉన్న చిలవారిపల్లె గ్రామస్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారని' ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆరోపించారు.కలెక్టర్ వల్ల బాల్ రెడ్డి అనే అతడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆరోపించారు. కులాల మద్య చిచ్చుపెట్టే ప్రయత్నం కలెక్టర్ చేశాడని మండిపడ్డారు.

ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎంపీలను ఒక లెక్కన ఏమైనా చూస్తున్నాడా? అని ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రశ్నించాడు. నా దగ్గర ఆడియో రికార్డులు ఉన్నాయని.. ఫ్రూఫ్స్ తోనే మాట్లాడుతున్నానని.. అవన్నీ సీఎం గారికి చూపిస్తానని తెలిపాడు.ఎందుకు కలెక్టర్ అహంకారిగా ప్రవర్తిస్తున్నాడని.. ఆయన వైఖరిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి మండిపడ్డారు.

వీడియో ఇదే..