Begin typing your search above and press return to search.

చంద్రబాబు, టీడీపీ నేతలపై ఏపీ మంత్రుల నిప్పులు

By:  Tupaki Desk   |   20 Oct 2021 10:49 AM GMT
చంద్రబాబు, టీడీపీ నేతలపై ఏపీ మంత్రుల నిప్పులు
X
ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. ఏపీ సీఎం జగన్ పై నిన్న టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. ప్రతిగా టీడీపీ ఆఫీసులు, నేతలపై వైసీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. దీనికి చంద్రబాబు పరిశీలించి రాష్ట్రపతి పాలన విధించాలని.. కేంద్ర బలగాలు పంపాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వైసీపీ, టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాష్ట్ర రాజకీయాలు తయారయ్యాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

-చంద్రబాబు 420: కొడాలి నాని ఫైర్

ఈ క్రమంలోనే ఏపీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆఫీసులో కూర్చొని జగన్ ను తిట్టారని.. అందుకే పార్టీ ఆఫీస్ ను పగులకొట్టారని తెలిపారు. చంద్రబాబు 420.. నాలుగు బల్లలు, కుర్చీలు పగులకొడితే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టా? అని నాని విమర్శించారు. నీ ఆఫీసు బల్లలు పగిలితే రాష్ట్రపతి పాలన పెట్టాలా? అని మండిపడ్డారు. చంద్రబాబు బంద్ కు పిలుపునిస్తే రాష్ట్రంలో బడ్డీకొట్టు కూడా మూయించలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

-మగాడివైతే దమ్ముంటే రా లోకేష్: మంత్రి అనిల్ ఓపెన్ చాలెంజ్

వైసీపీ నేతలను విమర్శిస్తున్న నారాలోకేష్ కు ఓపెన్ చాలెంజ్ విసిరారు మంత్రి అనిల్ కుమార్. నిజంగా అంత దమ్ముంటే వచ్చి తనను టచ్ చేయాలన్నారు. ‘లోకేష్ నీకు నిజంగా అంత దమ్ముంటే వచ్చి నన్ను టచ్ చేయి. నా కాన్వాయ్ ఉండదు.. పోలీసులు కూడా ఉండరు. ఒక్కడినే ఉంటారు. నెల్లూరులోనే 20 రోజులు ఉంటా.. ఇంటిపై దాడి చేస్తాం అన్నావ్ గా.. మగాడివైతే వచ్చి దాడి చేయి.. డైలాగులు కాదు..చేసి చూపించు.. మీ నాన్న రాయలసీమలో పుట్టి ఉంటే నెల్లూరు వచ్చి నా కార్యకర్తను టచ్ చేసింది..

-టీడీపీ నేతలు అడవిపందులు: మంత్రి వెల్లంపల్లి

సీఎం జగన్ పై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో వైసీపీ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వైసీపీ కార్యకర్తలు పంజాసెంటర్ లో చంద్రబాబు ఫొటోను చెప్పులతో కొడుతూ వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ కాదు.. 14 ఏళ్ల సీఎం అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలన్నారు. జగన్ సైగ చేస్తే రాష్ట్రంలో ఒక్క టీడీపీ నేత తిరగలేడని వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ పై చంద్రబాబు, అతడి అడవి పందులు మాట్లాడితే ఖబడ్ధార్ అంటూ ధ్వజమెత్తారు. ప్రజలను ఇబ్బంది పెడితే చంద్రబాబునుసైతం అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.

మొత్తంగా టీడీపీ విమర్శలకు ఏపీ మంత్రులు రంగంలోకి దిగి నోటికి పనిచెప్పారు. తీవ్ర విమర్శలతో రెచ్చిపోయారు.