Begin typing your search above and press return to search.
ప్రకాశం వైసీపీలో ఎమ్మెల్యేపై సొంత నేతల ఫైర్.. ఆయన వద్దంటూ.. ఆందోళనలు
By: Tupaki Desk | 12 Jun 2022 3:30 AM GMTఏపీ అధికార పార్టీ వైసీపీలో రోజుకో వివాదం.. రోజుకో విభేదం తెరమీదికి వస్తోంది. ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నేతలే తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. తమకుఈ ఎమ్మెల్యే వద్దు మహప్రభో! అంటూ.. వీధికెక్కుతున్నారు. దీంతో వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. 24 గంటల్లో రెండు జిల్లాల్లో చోటు చేసుకున్న పరిణామాలు.. వైసీపీ అధిష్టానానికి సైతం తలనొప్పిగా మారింది. కృష్నాజిల్లా మచిలీపట్నంలో ఎంపీ వర్సెస్ మాజీ మంత్రి బాలశౌరి, పేర్నినానిల మధ్య ఏర్పడిన వివాదం అగాథంగా మారింది. ఇక, ఇదే జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సొంత పార్టీ నేతలే ఫైర్ అవుతున్నారు.
దీంతో గన్నవరం వైసీపీ రాజకీయాల వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదనే టాక్ వైసీపీలోనే వినిపిస్తోంది. ఇదిలావుంటే, ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడులోనూ వైసీపీ నేతలు.. స్థానిక ఎమ్మెల్యేపై నిప్పులు చెరుగుతున్నారు. ఈయన మాకు వద్దంటూ.. ఆందోళనలకు దిగుతుండడం సర్వత్రా విస్మయానికి గురి చేస్తోంది. ఇటీవల జిల్లాల ఏర్పాటులో భాగంగా.. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు ఆనుకుని ఉన్న సంతనూతలపాడు నియోజకవర్గాన్ని బాపట్లలో కలవకుండా పట్టుబట్టి మరీ ప్రకాశంలోనే ఉంచారు. ఇప్పుడు ఆ నియోజకవర్గమే వైఎస్సార్‌సీపీకి తలనొప్పిగా మారింది.
ఏమిటీ వివాదం..
సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని నాగులుప్పలపాడు మండలానికి చెందిన వైసీపీ నేతలు నేరుగా మాజీ మంత్రి, జిల్లా కీలక నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర పంచాయితీ పెట్టారు. సుధాకర్ బాబును కాకుండా తమ మండలం వరకు మరో ఇన్‌చార్జిని నియమించాలని కోరారు. ఎమ్మెల్యే సుధాకర్ బాబు సొంత పార్టీ నేతలపైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు చెబుతున్నారు. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో పది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించారని బాలినేని ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు.
కేసు వాయిదాకు వెళ్లొస్తుండగా మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ కారు డ్రైవర్ ప్రమాదంలో మృతిచెందిన విషయాన్ని బాలినేని దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో వర్గ రాజకీయాలు చేస్తూ సొంత పార్టీ కార్యకర్తలనే వేధిస్తున్నారని.. నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి బాలినేనికి ఫిర్యాదు చేశారు. ఏ పనులు చేయాలన్నా కమీషన్లు తీసుకుంటున్నారని.. ఆఖరికి సీఎం సహాయ నిధి చెక్కుల్లోనూ వాటా అడుగుతున్నారంటూ ఆరోపించారు.
ఏపీఎంను బదిలీ చేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని డ్వాక్రా సంఘాల మహిళలు ఆరోపణలు చేశారు. దాంతో స్పందించిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఎమ్మెల్యే టీజేఆర్‌తో మాట్లాడతానని, అప్పటికీ తీరు మారకపోతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానంటూ నాగులుప్పలపాడు కార్యకర్తలకు హామీ ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెళ్లారు. ఈ పరిణామం వైసీపీలో కలకలం రేపుతోంది. మరి అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.
ఎవరీ సుధాకర్‌బాబు
కాంగ్రెస్ పార్టీలో యూత్ లీడర్‌గా పనిచేసిన టీజేఆర్ సుధాకర్ బాబు వైఎస్ మరణానంతరం వైసీపీలో చేరారు. పార్టీలో అధికార ప్రతినిధిగా కీలకంగా ఉంటున్న గుంటూరుకు చెందిన టీజేఆర్ సుధాకర్ బాబును 2019 ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గమైన సంతనూతలపాడు నుంచి వైసీపీ పోటీలో నిలిపింది. అంతకు ముందు 2014లో ఇదే నియోజకవర్గం నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్ గెలుపొందారు. 2019లో సురేష్ యర్రగొండపాలెం నుంచి పోటీ చేయగా.. టీజేఆర్ సంతనూతలపాడులో పోటీ చేసి విజయం సాధించారు.