Begin typing your search above and press return to search.

వైసీపీ నుంచి డైరెక్ట్ గా జనసేనలోకేనా..?

By:  Tupaki Desk   |   6 Sept 2022 8:00 AM IST
వైసీపీ నుంచి డైరెక్ట్ గా జనసేనలోకేనా..?
X
ఏపీలో జనసేన పంట పండేలా ఉంది. ప్రధాన పార్టీలలో ఉన్న రాజకీయం కాస్తా మూడవ పార్టీగా జనసేనకు ఊపిరిపోసే అవకాశాలు కచ్చితంగా కనిపిస్తున్నాయి. ఏపీలో అధికార పార్టీ చూస్తే ఇపుడు కిక్కిరిసిపోయి ఉంది. ఇక 151 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో మూడవ వంతు మీద తీవ్రంగా ప్రజా వ్యతిరేకత ఉంది అని నివేదికలు ఉన్నాయి. వారిని మార్చేసి కొత్త ముఖాలు పెట్టాలని అధినాయకత్వం చూస్తోంది

మరో వైపు చూస్తే కొన్ని చోట్ల పాతవారి పనితీరు బాగున్న కొన్ని మొహమాటాల వల్ల టికెట్లు ఇవ్వకపోవచ్చు అని తెలుస్తోంది. అలనటి వాటిలో ప్రకాశం జిల్లా దర్శి ఒకటి. ఇక్కడ బూచేపల్లి ఫ్యామిలీ రాజకీయంగా పలుకుబడిని సాధించింది. ఆ ఫ్యామిలీ తరఫున తండ్రీ కొడుకులు బూచేపల్లి సుబ్బారెడ్డి, శివ ప్రసాదరెడ్డి వరసగా 2004, 2009లలో ఎమ్మెల్యేలుగా నెగ్గారు.

ఇక 2014కి వచ్చేసరికి శివప్రసాదరెడ్డి ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. దాంతో 2019 ఎన్నికల్లో టికెట్ వద్దు అనుకున్నారు. అలా మద్దిశెట్టి వేణుగోపాల్ కి టికెట్ దక్కడం ఆయన ఏకంగా 39 వేల భారీ ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగిపోయాయి. అయితే జగన్ సర్కార్ అధికారంలోకి రావడంతో బూచేపల్లి ఫ్యామిలీ తమ హవా కొనసాగిస్తోంది.

ఇక్కడ ఎమ్మెల్యేగా వేణుగోపాల్ ఉన్నా శివప్రసాద్ రెడ్డి అంతా చేస్తున్నారు అన్న దాంతో వేణుగోపాల్ వర్గీయులు రగులుతున్నారట. ఇక జగన్ ఈ మధ్య నియోజకవర్గం టూర్ కి వచ్చినా వేణుగోపాల్ హాజరు కాలేదు. అక్కడ బూచేపల్లి శుబ్బారెడ్డి విగ్రహాన్ని జగన్ ప్రారంభించారు. ఈ నేపధ్యంలో బూచేపల్లి ఫ్యామిలీతో ఆయన చాలా సన్నిహితంగా వ్యవహరించారు. దాంతో వచ్చే ఎన్నికల్లో దర్శి టికెట్ శివప్రసాదరెడ్డికే ఇస్తారని ప్రచారం సాగుతోంది.

ఈ పరిణామాలను గమనిస్తున్న వేణుగోపాల్ కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంటారనే అంటున్నారు. ఆయన ఎన్నికలకు దగ్గర చేసి జనసేనలోకి వెళ్తారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. దాంతో వైసీపీకి కొత్త ఇబ్బందులు వస్తాయా అన్నది చూడాల్సి ఉంది. ఇదే కాదు కోస్తా సహా గుంటూరు జిల్లాలోని కొన్ని సీట్లలో ఈసారి టికెట్ దక్కదు అన్న వారు కూడా జనసేనకే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అని అంటున్నారు.

అలాగే వైసీపీలో ఉన్న కొందరు బలమైన సామాజికవర్గం నేతలు ఈసారి జనసేన నుంచి పోటీ చేస్తే తమకు గెలుపు ఖాయమని భావిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ నుంచి టీడీపీలోకి కంటే జనసేనలోకే చేరికలు ఈసారి ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అదే విధంగా గోదావరి జిల్లాలలో వైసీపీ బీసీలకు ఎక్కువగా టికెట్లు ఇస్తుంది అన్న చర్చ కూడా సాగుతోంది. దాంతో ఒక కీలక సామాజిక వర్గం నేతలు ఇక్కడ జనసేనతో టచ్ లో ఉంటున్నారని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.