Begin typing your search above and press return to search.
ఆత్మహత్యాయత్నం చేసిన వైసీపీ నేత ... ఎమ్మెల్యే వంశీపై సంచలన ఆరోపణలు
By: Tupaki Desk | 15 Dec 2020 1:18 PM ISTఏపీలో వైసీపీ కి చెందిన నేత ఆత్మహత్యాయత్నం చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేత ఆత్మహత్యాయత్ననికి ప్రయత్నించారు. మంగళవారం మధ్యాహ్నం వైసీపీ నేత మొగిలిచర్ల జోజిబాబు ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్ననికి ప్రయత్నించాడు. ఈ ఘటనను వెంటనే గుర్తించి, అప్రమత్తమైన అనుచరులు దాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరుడు కోట్లు పై జోజిబాబు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
ఇద్దరు నేతలు దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. దళితులకు రావాల్సిన టెండర్లను అడ్డుకుంటున్నారు. దళితులకు కాంట్రాక్ట్ పనులు ఎందుకంటూ అడ్డుకుంటున్నారు. కాంట్రాక్టుల కోసం వైసీపీని నాశనం చేస్తున్న ఎమ్మెల్యే వంశీ, కోట్లుపై అధిష్టానం చర్యలు తీసుకోవాలి’ అని జోజిబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన తర్వాత వైసీపీ మద్దతిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి నియోజకర్గంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వంశీ,యార్లగడ్డ అనుచరులు, వర్గీయులు కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యే వంశీల మధ్య తలెత్తిన విబేధాలకు ఫుల్ స్టాప్ పెట్టి వైఎస్ జగన్ వాళ్లిద్దర్నీ కలిపారు. అప్పట్నుంచి నియోజకవర్గంలో కాస్త గొడవలు తగ్గాయనని కార్యకర్తలు, అనుచరులు భావించారు. అయితే ఇప్పుడు ఏకంగా వైసీపీ నేతే ఇలా సంచలన ఆరోపణలు చేస్తూ ఆత్మహత్యాయత్నం చేయడంతో మళ్లీ అసలు అక్కడ ఏం జరుగుతుంది అంటూ చర్చించడం ప్రారంభించారు.