Begin typing your search above and press return to search.

బాలికలకు తాళిబొట్లు.. వైసీపీ నాయకుడి నిర్వాకం

By:  Tupaki Desk   |   27 April 2020 1:40 PM IST
బాలికలకు తాళిబొట్లు.. వైసీపీ నాయకుడి నిర్వాకం
X
ఎవరైనా యువతులకు.. పెళ్లి కాబోయే 18 ఏళ్లు నిండిన యువతులకు తాళిబొట్లు పంపిణీ చేస్తారు. ఇక పెళ్లి కుదిరిన కొత్త పెళ్లి కూతుళ్లకు తాళిబొట్లను పంపిణీ చేయడం మనం అనాదిగా చూస్తున్నాం. కానీ ఇక్కడో వైసీపీ నాయకుడు పెళ్లికి అర్హతే లేని మైనర్ బాలికలకు తాళిబొట్లు పంపిణీచేశాడు. అదీ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి సామూహికంగా అందరినీ ఒక్కచోట చేర్చి ఈ ఘనకార్యం నిర్వహించాడు. ఇప్పుడిది వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ నేత తీరు దుమారం రేపుతోంది.

అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని గెణిగెర గ్రామంలో వైసీపీకి జడ్పీటీసీ మాజీ సభ్యుడు నాగిరెడ్డి తన తాత జయంతి సందర్భంగా 9 మంది బాలికలకు ఉచితంగా దుస్తులుతోపాటు తాళిబొట్లను పంపిణీ చేశారు. తాళిబొట్లను చూసిన బాలికలు అవాక్కయ్యారు. పెళ్లీడు లేని చదువుకునే విద్యార్థులకు తాళిబొట్లు పంపిణీ చేయడం దుమారం రేపింది.

ఇక మన వైసీపీ నేత లాక్ డౌన్ లో భౌతిక దూరం పాటించకుండా ఇష్టారాజ్యం గా సామూహికంగా వీటిని అందజేశాడు. దీనిపై ఫిర్యాదు రావడంతో అధికారులు వెళ్లి విచారించారు. మైనర్ బాలికలకు తాళిబొట్లు ఇవ్వడంపై సదురునేతకు కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారట.. ఎందుకంటే అధికార పార్టీ మరీ. అందుకే చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకాడుతున్నారట..