Begin typing your search above and press return to search.

వరదలో కొట్టుకెళ్ళి వైసీపీ నేత మరణం..భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే చెవిరెడ్డి

By:  Tupaki Desk   |   28 Nov 2020 12:00 PM IST
వరదలో కొట్టుకెళ్ళి వైసీపీ నేత మరణం..భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే చెవిరెడ్డి
X
నివర్ చిత్తూరు జిల్లా చిన్నాభిన్నమైంది. పలు ప్రాంతాల్లో ఇళ్లు నేల కూలగా.. ఎక్కడ చూసినా విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలే కనిపిస్తున్నాయి. ఇక చేతికొచ్చిన వరి, వేరుశనగ, టమోటా, చెరకు తదితర పంటలన్నీ భారీ వర్షాలకు పూర్తిగా నాశనం అయిపోయి రైతులను నిండా మునిగిపోయారు. భారీ వర్షాలకు వంకలు వాగులు ప్రవహించడంతో జిల్లావ్యాప్తంగా రెండు రోజుల్లో ఐదుగురు చనిపోయారు.

పూతలపట్టు మండలం పాలకూరుకు చెందిన వైసీపీ నేత వినయ్ రెడ్డి కాణిపాకం నుంచి ఐరాలకు కార్లో వెళ్తూ మార్గమధ్యంలో వాగు దాటుతుండగా ప్రవాహం ధాటికి కొట్టుకుపోయి చనిపోయాడు. ఇతడు ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే వినయ్ రెడ్డి గ్రామానికి చేరుకొని మృతదేహానికి నివాళులు అర్పించారు. తన ఆత్మీయుడి మృతదేహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. వినయ్ రెడ్డి మరణం వైసీపీకి తీరని లోటని, పార్టీ ఆవిర్భావం నుంచి అతడు జెండా మోశాడని పలు పోరాటాల్లో పాల్గొని జైలుకు కూడా వెళ్లాడని చెవిరెడ్డి గుర్తుకు చేసుకున్నారు.

వినయ్ రెడ్డి కి ఇద్దరు చిన్నపిల్లలు ఉండడంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి చెవి రెడ్డి ముందుకు వచ్చారు. అంత్యక్రియల నిర్వహణ కోసం రూ.లక్ష అందజేసిన ఎమ్మెల్యే పిల్లల కోసం ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున రూ. 10 లక్షలు అందజేశారు.