Begin typing your search above and press return to search.
ఐటీడీపీ, టీం క్షత్ర దెబ్బకు వైసీపీ సోషల్ మీడియా బెంబేలు
By: Tupaki Desk | 6 Dec 2021 5:00 PM ISTరాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలైనా జరగొచ్చు. ఎప్పుడూ.. ఒకరిదే పైచేయి అనుకునే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు అలాంటి పరిణామమే తెరమీదకి వస్తోంది. ప్రస్తుతం ఎన్ని మాధ్యమాలు ఉన్నప్పటికీ.. ప్రజల్లో బలమైన ప్రచార మాధ్యమంగా.. ప్రజలకు అనుక్షణం అందుబాటులో ఉన్న మాధ్య మంగా సోషల్ మీడియా అందుబాటులో ఉంది.
ఈ క్రమంలోనే పార్టీలు.. ప్రత్యేకంగా.. కొన్ని విభాగాలను ఏర్పాటు చేసుకుని.. డిజిటల్ రూపంలోనూ ప్రజలకు చేరువ అవుతున్నారు. పార్టీ అధినేత ప్రసంగాల నుంచి పార్టీ కార్యక్రమాల వరకు డిజిటల్ రూపంలో ప్రజలకు చేరువ చేసేందుకు అన్ని పార్టీలూ ప్రాధాన్యం ఇస్తున్నాయి.
అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ, మరో పార్టీ జనసేనలు.. సోషల్ మీడియా విభాగంలో దూకుడుగా వ్యవహ రిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకపార్టీపై మరో పార్టీ పైచేయి సాధించేందుకు సైతం ప్రయత్నిస్తున్న విష యం తెలిసిందే. వాస్తవానికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సోషల్ మీడియాలో ఎప్పుడూ ముందున్న విషయం తెలిసిందే.
అనేక రూపాల్లో ప్రజలకు చేరువ కావడంలో టీడీపీ సోషల్ మీడియాను ప్రధానంగా వినియోగిం చుకుని ముందుంది. అయితే.. అధికార పక్షం వైసీపీ కూడా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. కానీ, కొన్ని నెలలుగా.. ప్రభుత్వం చేస్తున్న పనులు.. తీసుకుంటున్న నిర్ణయాలపై.. టీడీపీ ఐటీ విభాగం.. దూకుడుగా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది.
గతంలో అధికారంలోకి వచ్చేందుకు జగన్ ఏం చెప్పాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు.. అంటూ.. కంపేరిజ న్ పార్ట్‌ను ప్రజల ముందు ఉంచడంలో ఐటీడీపీముందుంది.
ప్రస్తుతం మద్యం, పింఛన్లు.. ఓటీఎస్ అంటూ..పేదల నుంచి డబ్బులు గుంజుకునే ప్రయత్నం.. ఇంటింటికీ చెత్త పన్ను.. మరుగు దొడ్ల పన్ను.. ఇలా అనేక రూపాల్లో జగన్ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతోందనే అంటున్నారు పరిశీలకులు. వీటిని ఐటీడీపీ విభాగం బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. దీనికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడం గమనార్హం.
మరోవైపు.. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి కీలక సోషల్ మీడియా మాధ్యమాలను వినియోగిస్తూ.. జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ననేతృత్వంలోని సోషల్ మీడియా క్షత్ర కూడా దూకుడుగా ఉంది. రహదా రులపైనా.. ప్రభుత్వ దుబారా పైనా.. ఇటీవల కాలంలో ఫేస్‌బుక్.. సోషల్ మీడియా ఉద్యమం నడిపించా రు.
అదేవిధంగా వరదల సమయంలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఎలా విస్మరించిందో కూడా సోషల్ మీడియా ద్వారా కళ్లకు కట్టారు. ఇలా.. ఈ రెండు పార్టీల సోషల్ మీడియా దూకుడు ముందు అధికార పార్టీ వైసీపీ సోషల్ మీడియా దమ్ము చూపలేక పోతోందని అంటున్నారు పరిశీలకులు.