Begin typing your search above and press return to search.

హిందూపురం వైసీపీలో మూడో కృష్ణుడు.. రంజుగా మారిన రాజ‌కీయం!

By:  Tupaki Desk   |   11 July 2023 2:46 AM IST
హిందూపురం వైసీపీలో మూడో కృష్ణుడు.. రంజుగా మారిన రాజ‌కీయం!
X
ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఇప్ప‌టికే తార‌స్థాయికి చేరా యి. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఐపీఎస్ అధికారి మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్‌.. గ‌తంలో పార్టీని ముందుండి న‌డిపించిన న‌వీన్ నిశ్చ‌ల్ వ‌ర్గాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉంది. ఇప్ప‌టికే ఈ వివాదాల‌తో త‌ల‌బొప్పి క‌ట్టి చాలా మంది సీనియ‌ర్లు పొరుగు పార్టీవైపు చూస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇదిలావుంటే.. హిందూపురాన్ని స‌త్య‌సాయి జిల్లాకేంద్రంగా మార్చ‌లేద‌నే ఆగ్ర‌హం ప్ర‌జ‌ల్లోనూ క‌నిపిస్తోంది.

ఇలా.. నియోజ‌క‌వ‌ర్గం వైసీపీలో అసంతృప్తులు, ఆగ్ర‌హ జ్వాల‌లు పెల్లుబుకుతున్న త‌రుణంలో.. వైసీపీ తీసుకున్న నిర్ణ‌యం మ‌రింత వివాదంగా మారింద‌ని ప‌రిశీల‌కులుచెబుతున్నారు. హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌య క‌ర్త‌గా.. తాజాగా మ‌హిళ‌ల‌ను పార్టీ ఇటీవల ఎంపిక చేసింది.

ఆమే దీపిక‌. సమన్వయకర్తగా నియమితులయ్యాక తొలిసారిగా హిందూపురం వచ్చిన ఆమెకు పార్టీ శ్రేణుల్లో ఉన్న అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు బాహాటంగా తెలిసివ‌చ్చాయి. తూమకుంట చెక్‌పోస్టు నుంచి హిందూపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించాల‌ని అనుకున్నా.. మ‌ధ్య‌లోనే కొంద‌రు వెళ్లిపోయారు.

దీంతో దీపిక నిశ్చేష్టురాల‌య్యారు. అయితే.. ఆమె అప్ప‌టిక‌ప్పుడు పైకి ఏమీ చెప్పక‌పోయినా.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు మాత్రం ప‌క్కాగా ఉన్నాయ‌ని గుర్తించారు. ఇదిలావుంటే.. పార్టీ నేత‌ల ముందు మాత్రం ఒకింత గంభీరంగానే దీపిక ప్ర‌సంగించా రు.

ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ నియోజకవర్గ ప్రజల సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు. చుట్టపు చూపుగా వస్తూ వెళ్తూ ఓటరు తీర్పును అపహాస్యం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.

పార్టీ నాయకులు, ప్రజలకు రుణపడి ఉంటానని, హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. హిందూపు రం సమన్వయకర్తగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞత లు తెలియజేశారు. కానీ, ఆమెకు స‌హ‌క‌రించేవారు ఎవ‌రు? క‌లిసి న‌డిచేవారు ఎవ‌రు? అనేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.