Begin typing your search above and press return to search.
టౌన్ పక్కకెళ్ళద్దురో... డౌన్ అయిన వైసీపీ గ్రాఫ్ ...?
By: Tupaki Desk | 10 Nov 2022 8:00 AM ISTవైసీపీకి 2019 ఎన్నికల్లో పల్లెలు అన్నీ జై కొట్టేశాయి. అదే టైం లో పట్టణాలు మెజారిటీ ఆ వైపునకు మళ్ళాయి. నూటికి నూరు శాతం కాదు కానీ అత్యధిక శాతం టౌన్లు కూడా ఆనాడు యువకుడు, కొత్త పార్టీ పెట్టుకుని వచ్చిన జగన్ తమకు ఏమి చేస్తారో అని ఉత్సాహంతో ఓట్లేశారు. నిజానికి అర్బన్ ఓటర్లు చంద్రబాబు సీఎం అయిన దగ్గర నుంచి గట్టిగా కాపు కాస్తున్నారు.
బాబు పాలనలో వచ్చిన ఐటీతో వారు బాగుపడ్డారు. అలాగే బాబు డెవలప్మెంట్ ఫలితాలను వారు పూర్తిగా పొందారు. ఇక చంద్రబాబు పాలనా సామర్ధ్యం వారికి ఎపుడూ నచ్చుతుంది. అయితే 2014 ఎన్నికల్లో అర్బన్ ఓటర్లు చంద్రబాబునే నమ్మి ఓటేశారు. హైదరాబాద్ కంటే ధీటైన రాజధానిని నిర్మిస్తారని భావించారు. అలాగే ఆంధ్రా అభివృద్ధి ఆకాశానికి తాకుతుందని కూడా ఆశించారు.
కానీ విభజన గాయాలు అనేక ఇతర కారణాలతో బాబు ఉమ్మడి ఏపీ సీఎం గా చేసిన మ్యాజిక్కులను కంటిన్యూ చేయలేకపోయారు. పైగా ప్రత్యేక హోదా మీద అర్బన్ ఓటర్లు ఆశపెట్టుకున్నారు. దాన్ని బాబు సాధించే విషయంలో విఫలం అయ్యారు. ఇలా అనేక విషయాల మీద వచ్చిన వ్యతిరేకతతో ఆయన్ని పక్కన పెట్టి జగన్ కి ఒక్క చాన్స్ ఇచ్చారు. కానీ జగన్ పాలన మీద ఫస్ట్ పెదవి విరిచింది అర్బం ఓటర్లే.
కరోనా ముందు నుంచే వైసీపీ ఏలుబడి మీద పట్టణ ఓటర్లలో మొదలైన వ్యతిరేకత ఇపుడు పీక్స్ కి చేరుకుంది. అత్యధిక శాతం ఇపుడు ఏపీలో అభివృద్ధి లేదు అంటూ బాహాటంగానే వ్యతిరేకతను వెళ్లగక్కుతున్నారు. అదే విధంగా జగన్ కంటే చంద్రబాబే నయం అన్న భావన కూడా వారిలో కలుగుతోందిట. ఇక రోడ్ల దుస్థితి మీద టౌన్ ఓటర్లు గుస్సా అవుతున్నారు. ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం పట్టణాల్లో లేదని యువతకు ఉపాధి అవకాశాలు లేవని, పరిశ్రమలు రావడం లేదని టౌన్ ఓటరు కన్నెర్ర చేస్తున్నాడు.
అంతే కాదు వైసీపీ వచ్చాక ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టడం మీద కూడా గుస్సా అవుతున్నాడు. ఇక మూడు రాజధానుల ఇష్యూ టౌన్ ఓటర్లకు అసలైన కరణంగా ఉందని అంటున్నారు. అమరావతి మీద చాలా మందికి గతంలో ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నా మూడు రాజధానుల ప్రహసనంతో పూర్తిగా మనసు మార్చేసుకున్నారు. ఏపీకి కేరాఫ్ అడ్రస్ గా ఏదో ఒక రాజధాని అయినా లేకుండా చేశారని వైసీపీ పాలకుల మీద మండిపడుతున్నారు.
దీంతో టౌన్ ఓట్ల మీద వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఆశలు పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. దానికి ఏ రకమైన సర్వే కూడా అసలు అవసరం లేదని కూడా చెబుతున్నారు. మరో వైపు చూస్తే చదువరులు, విద్యావంతులు, మేధావులు ఎక్కువ మంది ఉండే టౌన్ లో సోషల్ మీడియా మెయిన్ స్ట్రీం మీడియా ప్రభావం కూడా ఎక్కువే. దాంతో వారు వైసీపీ ఫస్టాఫ్ పాలన చూసే ఫ్లాప్ అనేశారని అంటున్నారు.
దీంతో వైసీపీ పెద్దలు కూడా కలవరపడుతున్నారు. పల్లెలు తమకు దన్నుగా ఉన్నా పట్టణాలలో కూడా గణనీయమైన ఓటింగ్ ఉందని, దాన్ని ఎంతో కొంత తిప్పుకోకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించింది. అందువల్లనే జగన్ ఇపుడు పూర్తి ఫోకస్ పట్టణాల మీదనే పెట్టారని అంటున్నారు. ఆయన నెలలో నాలుగైదు సార్లు టూర్లు చేస్తున్నారు. ఆయన టూర్లు కూడా పట్టణాలూ సెమీ అర్బన్ ఏరియాస్, టౌన్స్ నే ఎంచుకుని మరీ పెట్టుకుంటున్నారు.
ఈ సందర్బంగా ఆయన ఏపీ అభివృద్ధి గురించి చెబుతున్నారు. తమ హయంలోనే పరిశ్రమలు తీసుకువస్తామని అంటున్నారు. ప్రస్తుతానికి వచ్చిన వాటికి పునాది రాయి వేయడమో లేక ప్రారంభం చేయడమో చేస్తూ వస్తున్న జగన్ రానున్న కాలంలో టౌన్ ఓటర్లను కూడా ఆకట్టుకోవడానికి కొత్త వ్యూహాలు రచిస్తారు అని అంటున్నారు.
అయితే ఇప్పటికే ఒక డెసిషన్ కి వచ్చిన ఓటర్లు దారి మళ్ళుతారా అన్నది చూడాలి. అయితే రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు, పైగా ఏణ్ణర్ధం వ్యవధి సర్కార్ కి ఉంది కాబట్టి ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమో అని వైసీపీ నేతలు ఆశాభావంతో ఉన్నారని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.