Begin typing your search above and press return to search.

రఘురామకు షాక్.. లోక్ సభలో వెనక్కి తొక్కేశారు!

By:  Tupaki Desk   |   18 July 2020 2:00 PM IST
రఘురామకు షాక్.. లోక్ సభలో వెనక్కి తొక్కేశారు!
X
కొద్దిరోజులుగా వైసీపీ అధిష్టానంపై.. జగన్ పై తిరుగుబావుటా ఎగురవేస్తున్న నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు తాజాగా మరో షాకిచ్చింది వైసీపీ అధిష్టానం. ఆయనను లోక్ సభలో ప్రాధాన్యం లేని లాస్ట్ సీటుకు పంపించేసింది. ఇన్నాళ్లు ముందు వరుసలో ఉండి వైసీపీ తరుఫున మాట్లాడే రఘురామను ప్రాధాన్యం లేని వెనుక సీటుకు వైసీపీ అధిష్టానం మార్చేసింది.

లోక్ సభలో 4వ అతిపెద్ద పార్టీగా సీట్లను మార్చుకునే వెసులుబాటు వైసీపీకి ఉంది. లోక్ సభలో పార్టీల బలాబలాల ఆధారంగా ఎంపీలకు సీట్లను కేటాయిస్తారు. ఈ క్రమంలోనే ఇన్నాళ్లుగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రఘురామకు ఉన్న ముందు సీటును వైసీపీ వెనక్కి మార్చేసింది. నాలుగో సీట్లో ఉన్న రఘురామ సీటును ఏడో లైన్ కు మార్చేశారు. 379 సీటులో ఉన్న ఆయనను 445వ సీటుకు మార్చేశారు. రఘురామ స్థానంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు కేటాయించారు. ఇక ఏలూరు, విజయనగరం ఎంపీలను కూడా ముందుకు మార్చారు.

ఇప్పటికే ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ అధిష్టానం లోక్ సభ స్పీకర్ ఓ బిర్లాకు విజ్ఞప్తి చేసిన వైసీపీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని లోక్ సభ సచివాలయం కూడా ఆమోదించడంతో రెబల్ ఎంపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో ప్రాధాన్యం ఉన్న వారికి ముందు సీట్లు.. కొత్త ఎంపీలకు వెనుక ఇవ్వడం ఆనవాయితీ. ఇప్పుడు రఘురామను లోక్ సభలో వెనుక సీటుకు పంపి వైసీపీ అధిష్టానం గట్టి షాకే ఇచ్చింది.