Begin typing your search above and press return to search.

ఇదేం ప్ర‌చారం బ్రో.. ఈ రైతును ఎక్క‌డో చూసిన‌ట్టుందే!!

By:  Tupaki Desk   |   15 Oct 2022 3:09 PM GMT
ఇదేం ప్ర‌చారం బ్రో.. ఈ రైతును ఎక్క‌డో చూసిన‌ట్టుందే!!
X
బొంక‌రా బొంక‌రా బోడిగా అంటే.. టంగుటూరు మిరియాలు తాటికాయలంత!! అన్న‌ట్టుగా ఉంది.. వైసీపీ మూడు రాజ‌ధానుల ప్ర‌చారం. ప్ర‌స్తుతం అమ‌రావ‌తిని ఏకైక రాజ‌ధానిగా ఉంచాలంటూ.. అక్క‌డ భూములు ఇచ్చిన అన్న‌దాత‌లు .. ఉద్య‌మిస్తున్నారు. శాంతి యుత పంథాలో పాద‌యాత్ర చేస్తున్నారు.

అయితే.. మా కుందేటికి మూడు కాళ్లేన‌ని జ‌పం చేస్తున్న వైసీపీ నాయ‌కులు మాత్రం.. మూడు రాజ‌ధానుల కోసం.. ముప్పేట దాడి చేస్తున్నారు. అందినా .. అంద‌క పోయినా.. అవ‌కాశం నాదే అన్న‌ట్టుగా.. మూడుపై ప్ర‌చార ఆర్భాటాన్ని పెంచేశారు. పాద‌యాత్ర ఉత్త‌రాంద్ర‌లోకి అడుగు పెట్టేలోగా.. దీనిపై ఏదో ఒక ర‌కంగా.. క‌సి తీర్చుకోవాల‌న్న దుగ్థ‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ క్ర‌మంలో వైసీపీ నేత‌లు చేస్తున్న సోష‌ల్ మీడియా ప్ర‌చారం తాజాగా విక‌టించింది. ఎవ‌రు పెట్టారో.. ఎవ‌రి `స‌ల‌హా` మేర‌కు పెట్టారో.. తెలియ‌దు కానీ.. ఒక అద్భుత‌మైన పోస్టు మాత్రం పెట్టారు. ``నేను మూడు రాజ‌ధానుల‌కు అనుకూలం`` అని ఒక త‌ల‌పాగా చుట్టుకున్న రైత‌న్న‌.. స‌గ‌ర్వంగా.. చెబుతున్న ఓ పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అయితే.. వాస్త‌వానికి రైతులు.. న‌ష్ట‌పోయారు. రాజ‌ధానికి భూములు ఇచ్చి.. కౌలు రాక‌.. రాజ‌ధాన‌ని లేక‌.. డెవ‌ల‌ప్‌మెంట్ చేసిన ఫ్లాట్లు కూడా వారికి ఇవ్వ‌క‌.. వారు అలో ల‌క్ష్మ‌ణా అంటూ.. రోడ్డు ప‌ట్టుకుని.. న‌డుస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో మూడు రాజ‌ధానుల‌పై ఎంత ప్రేమ ఉన్నా.. సాటి రైతన్న ఇలా.. త‌ల ఎగరేసుకుని.. మ‌ద్ద‌తు ఇస్తాను! అని చెబుతాడా?!

ఎందుకంటే.. రైతులు ఎక్క‌డైనా రైతులే. వారి క‌ష్టం.. అంత‌టా ఒక్క‌టే. పార్టీల‌కు అతీతంగా.. రైత‌న్న‌ల‌కు ఒక జెండా ఉంది. వారికి ప్ర‌జ‌ల‌కు అన్నం పెట్టాల‌నే ఒక అజెండా ఉంది. అలాంటి రైత‌న్న‌లు సాటి రైతులు.. రోడ్డున ప‌డితే.. వారి గురించి ఆలోచించ‌కుండా.. ఇలా.. ద‌ర్జాగా.. క‌బుర్లు చెబుతారా? లేదు. అయితే.. ఇక్క‌డే వైసీపీలో `స‌ల‌హా` బెడిసి కొట్టింది. రైతులు పాద‌యాత్ర చేస్తున్నారుక‌దా.. వారికి మ‌నం ఎన్ని కౌంట‌ర్లు ఇచ్చినా.. ప్ర‌యోజ‌నం క‌నిపించ‌డం లేదు. సో.. ఇలా.. రైత‌న్న‌ను వ‌దిలేద్దాం.. అంటూ.. పాత చిత్రాన్ని అది కూడా మ‌న‌కు మ‌న రాష్ట్రానికి సంబంధం లేద‌ని చిత్రాన్ని తెచ్చి పోస్టు చేశారు.

ఇది ఒడిశా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న బ‌ల‌రాం యోజ‌న‌(శ్రీకృష్ణుడి అన్న‌గారు బ‌ల‌రాముడు.. వ్య‌వ‌సాయానికి ప్ర‌తీక‌. పైగా.. పూరిలో బ‌ల‌రామునికి అత్యంత ప్రాధాన్యం ఉంది) పేరుతో రైతుల‌కు అక్క‌డి న‌వీన్ ప్ర‌భుత్వం సాయం చేస్తోంది. దీనికి సంబంధించిన ఒక పోస్ట‌ర్‌ను వైసీపీ నాయ‌కులు పోస్టు చేసి.. దీనిలో మాట‌లు మార్చేసి.. ఏపీ ప్ర‌జ‌ల క‌ళ్ల‌కు మూడు రాజ‌ధానుల గంత‌లు క‌ట్టాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ.. నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.