Begin typing your search above and press return to search.

బద్వేల్ బై పోల్ : ప్రచారంలో వైసీపీ దూకుడు ..నియోజకవర్గంలో కీలక నేతల మకాం !

By:  Tupaki Desk   |   26 Oct 2021 5:30 PM GMT
బద్వేల్ బై పోల్ : ప్రచారంలో వైసీపీ దూకుడు ..నియోజకవర్గంలో కీలక నేతల మకాం !
X
బద్వేల్ .. ఈ నియోజకవర్గం లో జరగబోయే ఎన్నికల గురించి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఏపీ సీఎం సొంత జిల్లా కావడం తో పాటుగా అధికార పార్టీ కి ఇక్కడ గెలుపు చాలా ముఖ్యం. ప్రజలు తమ వైపే ఉన్నారు అని చెప్పడానికి పార్టీకి ఈ విజయం చాలా అవసరం. సాంప్రదాయం పేరుతో టీడీపీ , జనసేన బరిలో లేనప్పటికి బీజేపీ పోటీలో నిలవడం తో ఎన్నికల హోరు తారా స్థాయికి చేరింది. సీఎం జగన్ బద్వేల్ బై పోల్ లో భారీ రావాలని నేతలని ఆదేశించడం తో జిల్లా ముఖ్యనేతలతో పాటుగా ఇతర జిల్లాల నేతలు సైతం బద్వేల్ నియోజకవర్గం లో వైసీపీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు.

తాజాగా ఈ రోజు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ రోజు బద్వేల్ నియోజయవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గం లోని ఓటర్లు వైసీపీకే పూర్తి మద్దతు తెలుపుతున్నారని, ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు అందాయని చెప్పారు. అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెడుతుందని చెప్తున్న దాంట్లో వాస్తవం లేదని, మాకు అంత కర్మ పట్టలేదు అని చెవిరెడ్డి చెప్తూ , ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలు ఎన్ని వచ్చినా స్వాగతిస్తామని , మా విజయం మాకు అమితమైన విశ్వాసం ఉందని తెలిపారు. బద్వేల్ లో ఉం ఎన్నికల్లో వైసీపీ అఖండమైన మెజారిటీ తో గెలుపొందాలని పిలునిచ్చారు.

ఇక ఇదే సమయంలో కడప జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారని, ఆ ఇద్దరూ కూడా రాష్ట్ర ప్రజల మన్ననలను పొందారని తెలిపారు. ఇక చిత్తూరు జిల్లా నుంచి కూడా ఇద్దరు సీఎంలుగా పని చేశారని, ఒకర మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయయారని, మరొకరైన కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారని విమర్శలు చేశారు. అలాగే మరోవైపు సినీ నటి , నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దేశంలోనే గొప్ప మనసున్న నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని , రాష్ట్రంలో సీఎం జగన్‌ సంక్షేమ పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌పై ఉన్న అభిమానాన్ని బద్వేల్‌ ఉప ఎన్నికలో చూపించాలని కోరారు. అడవికి రాజు సింహం ఐతే. ఆంధ్రప్రదేశ్ రారాజు సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటూ సినిమా డైలాగ్స్ తరహాలో పంచ్ డైలాగ్స్ తో రోజా ఆకట్టుకుంది. మహిళా సంక్షేమానికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారని , ఇకపై కూడా మహిళలకి రక్షణ కల్పిస్తారని అందరూ జగనన్న ను ఆశీర్వదించాలని కోరుకున్నారు.

అక్టోబర్‌ 30న పోలింగ్‌ నిర్వహిస్తారు. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. బద్వేలు నియోజకవర్గ పరిధిలోని బద్వేలు, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు మండలాలు ఉన్నాయి. బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 28 న మరణించారు . దీనితో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ వెంకటసుబ్బయ్య బద్వేలు ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి పోటీచేసి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఓబుళాపురం రాజశేఖర్‌ పై 44,834 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. డాక్టర్‌ వెంకటసుబ్బయ్యకు 95,482 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి 50,748 ఓట్లు వచ్చాయి.