Begin typing your search above and press return to search.

టీడీపీ ట్రాప్ లో వైసీపీ!!

By:  Tupaki Desk   |   11 Sep 2020 11:50 AM GMT
టీడీపీ ట్రాప్ లో వైసీపీ!!
X
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంటుంది టీడీపీ అధినేత చంద్రబాబు తీరు అన్న విమర్శలు రాజకీయాల్లో ఉన్నాయి. ఆయన తుమ్మినా వార్త రాయించుకొని పబ్లిసిటీ చేసుకునే మనిషి అంటారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఏం లేకున్నా ఉన్నట్టు కనికట్టు చూపించి తిమ్మిని బమ్మిని చేయగలరంటారు.. రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని ‘ఈజీ ఆఫ్ డూయింగ్’లో దేశంలోనే నంబర్ 1లో నిలిపిన ఘనత చంద్రబాబుదీ. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే.. రెండో వైపు మాత్రం ఈ ర్యాంకుతో ఏపీకి ఏం ఒరిగింది? ఉద్యోగ కల్పన జరిగిందా? నిరుద్యోగులకు ఉద్యోగాలొచ్చాయా? అంటే ఒక్కటి లేదు. ఇప్పుడు అదే ర్యాంకుల యావలో పడి వైసీపీ కూడా కొట్టుకుపోతోందని అంటున్నారు. ర్యాంకుల పిచ్చితో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయడం లేదన్న విమర్శలు ఏపీ యువత నుంచి వ్యక్తమవుతున్నాయి.

‘ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఏపీ నంబర్ 1 పొజిషన్ లోకి వచ్చింది. 2019 మార్చి వరకు తీసిన రికార్డ్స్ ప్రకారం ఏపీ దేశంలోనే ఈ ఘనత సాధించింది. అయితే 2019 మార్చి వరకు ఏపీలో అధికారంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వం. అంటే ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబుకే దక్కుతుంది. వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కక ముందు రికార్డుల ప్రకారం ఏపీకి ఈ ఘనత దక్కింది.

అయితే దేశంలోనే నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నందుకు ఈ క్రెడిట్ మాదంటే మాది అని టీడీపీ, వైసీపీలు డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ అసలు విషయంకు వస్తే ఏపీ నంబర్ 1 అయితే కానీ దానివల్ల ఏపీలో ఎన్ని కొత్త జాబ్స్ వచ్చాయంటే ఈ పార్టీలు నోరు మెదపరు. దానివల్ల ఏపీలో ఔట్ సోర్సింగ్ వచ్చింది. అదనంగా ఆదాయం వచ్చిందా అంటే అది మాత్రం ఇద్దరూ చెప్పరు.

ఏపీకి ర్యాంక్ వస్తే మాత్రం మాది..మాది అంటూ క్రెడిట్ కోసం బట్టలు చింపుకుంటారు తప్పితే దాని వల్ల ఏపీకి ఎన్ని కొత్త జాబులు వచ్చాయి? ఏ రంగంలో వచ్చాయి? అని ఇద్దరూ పూర్తి స్థాయి లెక్కలు మాత్రం చెప్పడం లేదు అని సోషల్ మీడియాలో ఇద్దరినీ నిరుద్యోగులు ఏకిపారేస్తున్నారు.

ర్యాంక్ వస్తే మాది అంటారు.. ర్యాంక్ రాకపోతే తప్పు వాళ్లది అని ఇద్దరూ అంటూ ఉంటారు.. ఈ ర్యాంకులు అన్ని బోగస్ లు అని చెప్తూ టీడీపీ ట్రాప్ లో వైసీపీ పడిందని కూడా కామెంట్స్ చేస్తున్నారు.