Begin typing your search above and press return to search.

ప్రధాని పదవీపై యశ్వంత్ సిన్హా ఆశలు

By:  Tupaki Desk   |   22 Jan 2019 8:13 AM GMT
ప్రధాని పదవీపై యశ్వంత్ సిన్హా ఆశలు
X
బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. యశ్వంత్ సిన్హా వాజ్ పేయి హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యహరించారు. ఆ తర్వాత బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రభావం అంతగా కనిపించలేదు. తాజాగా ఆయన ప్రధాని పదవిపైనే కన్నేశారు.

కొన్నాళ్లుగా బీజేపీలో అసంతృప్తుడిగా సాగుతున్న యశ్వంత్ సిన్హా ప్రధాని పదవిపై తనకు ఆశ ఉందని ప్రకటించుకున్నాడు. ఎన్డీటీవీ ఇంటర్వూలో భాగంగా ప్రధాని పదవీకి మోడీ బదులు గడ్కరీ ప్రధాని అయితే ఎలా ఉంటుందనే ప్రశ్న ఎదురుగా దానిపై ఆయన పెదవి విరిచారు. గడ్కరీ ప్రధాని అయినా ఏ ప్రయోజనం ఉందదని కుండబద్దలు కొట్టారు. ప్రధాని పదవీకి తనలాంటి వాడైతేనే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం దేశానికి ఏం కావాలో తనకు తెలుసునని యశ్వంత్ సిన్హా తెలిపారు. ఇప్పుడు ఉద్యోగాల సృష్టి అంత్యంత కీలకమని చెప్పారు. యువత నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతుందని తానైతేనే ఉద్యోగాల సృష్టితోపాటు అన్ని రంగాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లగలనని చెప్పారు.

అయితే యశ్వంత్ సిన్హాకు మోడీ అంతటి చరిష్మా గానీ బీజేపీ సపోర్టు గానీ లేదు. తన కుమారుడు జశ్వంత్ సిన్హా సైతం మోడీ కేబీనెట్లో మంత్రిగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రధాని పదవి దక్కడం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప.. ఆయన ప్రధాని పదవి అందని ద్రాక్షగానే మిగలనుంది.