Begin typing your search above and press return to search.

అణుప‌రీక్ష‌ల‌పై అట‌ల్ ఆయ‌న‌కు ముందే చెప్పార‌ట‌!

By:  Tupaki Desk   |   19 Aug 2018 5:33 AM GMT
అణుప‌రీక్ష‌ల‌పై అట‌ల్ ఆయ‌న‌కు ముందే చెప్పార‌ట‌!
X
గ‌తం ఎప్పుడూ గొప్ప‌గా ఉంటుంది. అట‌ల్ లాంటి వ్య‌క్తి జీవితానికి సంబంధించిన అంశాలు మ‌రింత గొప్ప‌గా అనిపిస్తాయి. ప్ర‌ధాన‌మంత్రి కుర్చీని ఒకే ఒక్క ఎంపీ సీటు తేల్చేస్తుంద‌ని ప‌క్కాగా తెలిసిన‌ప్పుడు.. ఎవ‌డైనా స‌రే.. తొక్క‌లో విలువ‌లు.. సిద్దాంతాలు త‌ర్వాత‌.. ముందు ఆ ఒక్క ఓటు లెక్క చూడండ‌ని చెబుతారు.

చేతిలో ఫుల్ అధికారం ఉన్న‌ప్ప‌టికీ.. వాటిని ఉప‌యోగించుకోకుండా.. వ్య‌వ‌స్థ‌ల్ని త‌న అధికారంతో ప్ర‌భావితం చేయ‌కుండా.. ప‌రీక్ష‌కు నిల‌బ‌డ‌టం.. అందులో విప‌క్ష కుటిల నీతికి త‌న ప్ర‌భుత్వం ప‌డిపోతున్నప్ప‌టికీ విలువ‌ల్ని బ్రేక్ చేయ‌క‌పోవ‌టం అట‌ల్ కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది.

ఇవాల్టి రోజున అధికారంలో ఉన్న వారి ప్ర‌భుత్వాల్ని ప‌డేయ‌టం త‌ర్వాత‌.. క‌నీసం వారి గురించి ఘాటు విమ‌ర్శ‌లు.. తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తేనే.. లెక్క‌లు చూడాల‌న్న‌ట్లుగా కొన్ని వ్య‌వ‌స్థ‌ల్ని రంగంలోకి దించుతున్న అధికార‌ప‌క్ష అధినేత‌ల‌తో పోలిస్తే.. అట‌ల్ లాంటి వ్య‌క్తి ఒక‌రు భార‌త రాజ‌కీయాల్లో ఉన్నారా? అన్న సందేహం భ‌విష్య‌త్ త‌రాల‌కు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోవ‌వాల్సిన ప‌ని లేదు.

అట‌ల్ మ‌ర‌ణం నేప‌థ్యంలో కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పోఖ్రాన్ లో నిర్వ‌హించిన అణు ప‌రీక్ష‌ల గురించి ఆయ‌నో ఆస‌క్తిక‌ర అంశాన్ని వెల్ల‌డించారు. 1998 మేలో వాజ్ పేయ్ త‌న‌ను పిలిచార‌ని.. కొద్దిరోజుల్లో అణు ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని అనుకున్న విష‌యాన్ని త‌న‌కు చెప్పిన‌ట్లువెల్ల‌డించారు.

వాజ్ పేయ్ మాట‌ల‌తో తాను షాక్ తిన్నాన‌ని.. అణు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే.. అగ్ర‌దేశాలు ఎన్ని ఆంక్ష‌లు విధిస్తాయోన‌న్న భ‌యం త‌న‌ను వెంటాడింద‌ని.. అయిన‌ప్ప‌టికీ తాను ఆ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌లేద‌న్నారు. అత్యంత ర‌హ‌స్యంగా నిర్వ‌హించిన ప్రోఖ్రాన్ అణు ప‌రీక్ష‌ల స‌మాచారం త‌న‌కు ముందే ఉంద‌ని య‌శ్వంత్ చెప్ప‌టం ద్వారా వాజ్ పేయ్ త‌న‌ను ఎంత‌గా న‌మ్మేవారో.. త‌న‌కెంత ప్రాధాన్య‌త ఇచ్చే వార‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పినట్లైంది.