Begin typing your search above and press return to search.
నిజమా... ‘విక్రమార్కుడు’లో ఐపీఎల్ స్టార్
By: Tupaki Desk | 15 May 2023 5:34 PMఐపీఎల్ లో ఈసారి స్టార్ బ్యాట్స్మెన్స్ కు ఏమాత్రం తీసి పోకుండా కుర్రాడు యశస్వి జైస్వాల్ కుమ్మేస్తున్నాడు. ఒక సెంచరితో పాటు 98 పరుగుల ఇన్నింగ్స్ కూడా యశస్వి ఈ ఐపీఎల్ లో కుమ్మేశాడు. అంతటి గొప్ప ఇన్నింగ్స్ లు ఆడిన యశస్వి జైస్వాల్ త్వరలోనే టీం ఇండియాలో చేరి భారత్ తరపున ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
సోషల్ మీడియా లో యశస్వి జైస్వాల్ గురించి తెగ ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ లో తెగ సందడి చేస్తున్న జైస్వాల్ కు అభిమాన పేజీలు కూడా క్రియేట్ అవుతున్నాయి. ఇదే సమయంలో మీమ్స్ తో కూడా జైస్వాల్ పై తమ అభిమానాన్ని చాటుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు.
మొత్తానికి సోషల్ మీడియాలో యశస్వి యొక్క సందడి అంతా ఇంత లేదు. తాజాగా ఒక మీమ్ ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాలోని ఒక సన్నివేశాన్ని తీసుకుని అందులోని బుడ్డోడు ప్రస్తుత స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ అంటూ మీమ్ క్రియేట్ చేశారు.
విక్రమార్కుడు సినిమాలో రేయ్ సత్తీ బాల్ ఇటు వచ్చిందా అంటూ ఒక కుర్రాడు రవితేజను పిలిచి అడుగుతాడు. అప్పుడు పిల్లాడిని లోనికి తీసుకు వెళ్లి రవితేజ కొడతాడు. ఆ సన్నివేశం ఇప్పటికి కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.
ఆ సీన్ లో కుర్రాడు మరెవ్వరో కాదు యశస్వి జైస్వాల్ అంటూ మీమ్ లో పేర్కొన్నారు. దాంతో చాలా మంది కూడా నిజమే అయ్యి ఉంటుందని అనుకున్నారు. కానీ చూడ్డానికి కాస్త పోలికలు అలాగే ఉన్నాయి కానీ విక్రమార్కుడు సినిమాలో కనిపించిన కుర్రాడు యశస్వి కాదు.

ముంబైకి చెందిన యశస్వి నిరుపేద కుటుంబం నుండి వచ్చాడు. ఎంతో కష్టపడి క్రికెటర్ అయ్యాడు. పానీపూరి బండి వద్ద పని చేసుకున్న యశస్వి ఇప్పుడు ఐపీఎల్ లో మెరుపులు మెరిపిస్తూ అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి దూసుకు వెళ్తున్నాడు.