Begin typing your search above and press return to search.
వంశీతో పని చేసేది లేదని జగన్ కే నేరుగా చెప్పేశాడట
By: Tupaki Desk | 5 Oct 2020 10:30 AM ISTఒక పార్టీలో గెలిచి.. మరోపార్టీకి వెళ్లిన వేళ.. అప్పటికే ఆ పార్టీలో ఉన్న వారిని కలుపుకోవటం.. వారు సైతం తనను ఓకే చేసేలా వ్యవహరించటం అంత తేలికైన విషయం కాదు. చాలామంది నేతలు ఈ విషయంలో ఫెయిల్ అవుతుంటారు. ఇలాంటి వారి పుణ్యమా అని అప్పటివరకు లేని కొత్త లొల్లి పార్టీల్లో చోటు చేసుకుంటూ ఉంటుంది. గన్నవరం రాజకీయం చూస్తే.. ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొని ుందని చెప్పాలి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వంశీ.. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం తెలిసిందే.
గన్నవరంలో తన మీద పోటీ చేసి ఓడిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతల్ని కలుపుకుపోవటం వంశీకి ఏ మాత్రం చేతకావటం లేదని చెబుతున్నారు. దీంతో.. వీరిద్దరి మధ్య అధిపత్య పోరు అంతకంతకూ పెరుగుతోంది. అయితే.. వంశీ మాత్రం తాను ఎవరితోనైనా పని చేసేందుకు సిద్ధమని చెబుతున్నా.. అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సానుకూలంగా స్పందించటం లేదు.
వంశీతో తాను పని చేసేది లేదని.. యార్లగడ్డ వెంకట్రావు తాజాగా తేల్చి చెప్పారు. వంశీ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో తన జన్మదిన వేడుకల్ని వంశీ జరపకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అంతేకాదు.. వంశీతో తాను కలిసి పని చేయలేనన్న విషయాన్ని అధినేత జగన్మోహన్ రెడ్డికి తానిప్పటికే చెప్పినట్లుగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోలీసలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని.. ఎమ్మెల్యే.. మంత్రి ఒత్తిడి ఉందని చెబుతున్నారని.. తన కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లుగా సంకేతాలు వెలువడిన నాటి నుంచి వంశీని యార్లగడ్డ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అయితే.. యార్లగడ్డతో సహా అందరునేతల్ని తాను కలుపుకుపోతున్నట్లుగా వంశీ చెబుతున్నారు. వీరిద్దరి మధ్య నడుస్తున్న అధిపత్య పోరు పార్టీకి చేటుగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.
దీనికి తగ్గట్లే.. ప్రతి వారంలో కనీసం ఒకట్రెండుసార్లు అయినా.. ఏదో ఒక వివాదంతో ప్రెస్ మీట్ పెట్టటం.. ఘాటు విమర్శలు చేసుకోవటం పరిపాటిగా మారింది. ఇలాంటివేళ.. తాజాగా వంశీతో కలిసి తాను పని చేయలేనని పార్టీ అధినేతకు క్లియర్ గా చెప్పినట్లుగా చేసిన యార్లగడ్డ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలాన్ని రేపుతున్నాయి. గన్నవరం పంచాయితీకి జగన్ ఏ మందు వేస్తారో చూడాలి.