Begin typing your search above and press return to search.

యాహూలో 50 కోట్ల అక్కౌంట్లు హ్యాక్‌

By:  Tupaki Desk   |   23 Sep 2016 12:44 PM GMT
యాహూలో 50 కోట్ల అక్కౌంట్లు హ్యాక్‌
X
ప్ర‌ముఖ ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం యాహూ త‌న యూజ‌ర్ల‌కు పెద్ద పిడుగులాంటి వార్త వెల్ల‌డించింది. 50 కోట్ల మంది యాహూ యూజ‌ర్ల అక్కౌంట్లు హ్యాకింగ్‌కు గురైన‌ట్టు సంస్థ ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న‌తో యాహూ యూజ‌ర్లు ఒక్క‌సారిగా షాక్ అయిపోయారు. యాహూ చీఫ్ ఇన్‌ ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ బాబ్ లార్డ్ ఈ విషయాన్ని గురువారం వెల్ల‌డించారు. ఈ 50 కోట్ల మంది యూజ‌ర్ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని 2014లో త‌స్క‌రించార‌ని... యాహూ ఆన్‌ లైన్ ఖాతాదారులంద‌రూ త‌మ పాస్‌ వ‌ర్డ్‌ ల‌ను వెంట‌నే మార్చుకోవాల‌ని కూడా యాహూ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

త‌స్క‌రించిన స‌మాచారంలో యూజ‌ర్ల పేర్లు - ఈ మెయిల్ చిరునామాలు - ఫోన్ నెంబ‌ర్లు - పుట్టిన తేదీలు - పాస్‌ వ‌ర్డ్‌ లు ఇలా చాలా ఉన్నాయ‌ని కూడా యాహూ వెల్ల‌డించింది. యూజ‌ర్లు అనుమానాస్పద లింక్ లపై క్లిక్ చేయొద్దని - డౌన్ లోడ్లు చేయొద్దని హెచ్చరించింది. ప్ర‌స్తుతం ఈ హ్యాకింగ్‌ పై విచార‌ణ కొన‌సాగుతోంద‌ని కూడా బాబ్ లార్డ్ చెప్పారు.

యూజ‌ర్ల పేమెంట్ కార్డ్ డేటా - బ్యాంక్ అక్కౌంట్‌ ల‌ స‌మాచారం హ్యాకింగ్‌ కు గురైన సిస్ట‌మ్‌ లో సేవ్ చేయ‌లేద‌ని..ఈ విష‌యంలో మాత్రం ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న తెలిపారు. ఇక ఈ హ్యాకింగ్ చేసిన వారు యాహూ నెట్ వ‌ర్క్‌ను ఎప్ప‌టి నుంచి వాడుతున్నార‌న్న ప్ర‌శ్న‌ల‌పై కూడా ఆయ‌న స్పందించారు. హ్యాక‌ర్లు యాహూతో చాలా త‌క్కువ రోజులుగా మాత్ర‌మే సంబంధం క‌లిగి ఉన్నార‌ని ఆయ‌న చెప్పారు.

ఇక ఏకంగా 50 వేల మంది యాహూ యూజ‌ర్ల అక్కౌంట్లు హ్యాకింగ్‌ కు గుర‌వ్వ‌డం అతి పెద్ద సైబర్ ఉల్లంఘనగా టెక్ నిపుణులు భావిస్తున్నారు. దీనిపై షేప్ సెక్యూరిటీ అధికారులు స్పందిస్తూ 2014 నుంచి పాస్‌ వ‌ర్డ్‌ లు మార్చ‌ని యూజ‌ర్లు వెంట‌నే త‌మ పాస్‌ వ‌ర్డ్‌ లు మార్చుకోవాల‌ని సూచిస్తున్నారు. ఈ ఎఫెక్ట్‌ తో 4.8 బిలియన్ డాలర్ల యాహూ వెరిజోన్ అమ్మ‌కాల‌పై ప్ర‌భాం చూప‌నుంది. ఇది యాహూకు పెద్ద దెబ్బే. గ‌తంలోనే హ్యాక‌ర్లు వ‌ర‌ల్డ్ వైడ్‌ గా జీమెయిల్ - హాట్ మెయిల్ - యాహూ అకౌంట్లు హ్యాక్ చేసి పాస్ వర్డ్స్ - ఇత‌ర స‌మాచారాన్ని దొంగిలించి... ఈ స‌మాచారం మొత్తాన్ని ర‌ష్యాలోని అండ‌ర్ వ‌ర‌ల్డ్‌ కు అమ్మిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.