Begin typing your search above and press return to search.

'మోస్ట్ సెర్చ్డ్ పర్సనాలిటీ' సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్

By:  Tupaki Desk   |   2 Dec 2020 5:00 PM IST
మోస్ట్ సెర్చ్డ్ పర్సనాలిటీ  సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్
X
ఈ సంవత్సరం ఎక్కువ మంది వెతికిన సెలబ్రిటీల జాబితాను సెర్చ్ ఇంజన్ యాహూ ప్రకటించింది. దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 లో 'మోస్ట్ సెర్చ్డ్ పర్సనాలిటీ'గా నిలిచాడు. అయితే యాహూ జాబితాలో ప్రధాని నరేంద్రమోదీని సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ వెనుకకు నెట్టారు. 2017 నుంచి తొలి స్థానంలో నిలుస్తున్న ప్రధాని మోదీ 2020లో రెండోస్థానంతో సరిపెట్టుకొన్నారు.

ఈ జాబితాలో రాహుల్ గాంధీ, అమిత్ షా, ఉద్దవ్ థాక్రే, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాంటి ప్రముఖులు ఉన్నారు. నటి రియా చక్రవర్తి అత్యధికంగా శోధించిన మహిళా సెలబ్రిటీగా నిలిచింది. కోవిడ్ వారియర్స్ ను ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' 2020 గా పేర్కొంది.

'మోస్ట్ సెర్చ్డ్ మేల్ సెలబ్రిటీ' విభాగంలో సుశాంత్ అగ్రస్థానంలో ఉండగా, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్‌తో పాటు కరోనా కారణంగా మరణించిన గాన గంధర్వుడు ఎస్సీ బాలసుబ్రమణ్యం, దివంగత బాలీవుడ్‌ సీనియర్‌ హీరో రిషి కపూర్‌, క్యాన్సర్‌తోచనిపోయిన ఇర్ఫాన్‌ ఖాన్‌ కూడా ఆ లిస్టులో ఉన్నారు. ఈ ఏడాది 'మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీ' జాబితాలో రియా మొదటి స్థానంలో ఉంది. నటి కంగనా రనౌత్ రెండవ స్థానంలో, దీపికా పదుకొనే, సన్నీ లియోన్, ప్రియాంక చోప్రా ఉన్నారు.

'సెలబ్రిటీస్ విత్ బేబీస్ అండ్ ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్స్' లో అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచారు. కరీనా కపూర్ ఖాన్ - సైఫ్ అలీ ఖాన్ రెండో స్థానంలో ఉండగా - శిల్పా శెట్టి రాజ్ కుంద్రా మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా కరోనా - లాక్‌ డౌన్‌ కాలంలో వలస కార్మికులకు అండగా నిలిచిన నటుడు సోనూ సూద్‌ ను 'హీరో ఆఫ్ ది ఇయర్' గా ప్రత్యేకంగా గుర్తించింది

బాలీవుడ్ హీరో - దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన మరణించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సినీ అభిమానులను విషాదంలోకి నెట్టింది. అయితే సుశాంత్‌ తన మరణం తర్వాత అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నాడు. యాహూ ఇండియా సర్చ్ ఇంజిన్ రిలీజ్ చేసిన గణాంకాల్లో సుశాంత్ అత్యధికంగా సర్చ్ చేసిన సెలబ్రిటీగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నారు.