Begin typing your search above and press return to search.

తేనె తుట్టెను రేపుతున్న య‌డ్యూర‌ప్ప‌!

By:  Tupaki Desk   |   3 Feb 2020 3:30 PM GMT
తేనె తుట్టెను రేపుతున్న య‌డ్యూర‌ప్ప‌!
X
దాదాపు రెండు నెల‌ల నుంచి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ గురించి క‌స‌ర‌త్తును చేస్తూ ఉన్నార‌ట క‌ర్ణాట‌క సీఎం య‌డియూర‌ప్ప. క‌ర్ణాట‌క‌ లో కాంగ్రెస్-జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల విష‌యంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో వారంతా దాదాపుగా గెల‌వ‌డంతో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ అంశం తెర మీద‌కు వ‌చ్చింది. తిరుగుబాటు ఎమ్మెల్యేల‌ను గెలిపిస్తే.. వారంద‌రికీ మంత్రి ప‌ద‌వులు అంటూ అప్ప‌ట్లో య‌డ్యూర‌ప్ప ప్ర‌చారం లో ఊద‌ర‌గొట్టారు. వారంతా గెలుస్తార‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రేమో! ఎవ‌రో కొందరు గెలుస్తారు, వారికి మంత్రి ప‌ద‌వులు ఇస్తే స‌రి పోతుంద‌ని య‌డియూర‌ప్ప కూడా అనుకుని ఉండ‌వ‌చ్చు. అయితే ఎక్కువ‌ మంది గెల‌వ‌డం తో.. వారంద‌రినీ మంత్రి వ‌ర్గంలోకి తీసుకోవ‌డం సాధ్య‌మేనా.. అనేది చ‌ర్చ‌నీయాంశంగా నిలిచింది.

దీంతో రెండు నెల‌ల‌పాటు య‌డ్యూర‌ప్ప క‌స‌ర‌త్తు చేశారు. ఢిల్లీ వెళ్లారు, అమిత్ షా కు లిస్టు ఇచ్చారు.. అదిగో ఇదిగో అంటూ .. చివ‌ర‌కు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌ కు ముహూర్తాన్ని ఖ‌రారు చేశార‌ట‌. ఈ నెల ఆరో తేదీన య‌డ్యూర‌ప్ప త‌న మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించ‌నున్నార‌ట‌. ఇది విస్త‌ర‌ణ అన‌డం క‌న్నా, పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ అనొచ్చేమో. ప‌ది మంది కొత్త వారిని తీసుకోవాలంటే.. ఉన్న వారిని కొంద‌రిని త‌ప్పించాల్సి రావొచ్చ‌ని అంటున్నారు. అలాగే కుల స‌మీక‌ర‌ణాలు ఉండ‌నే ఉంటాయి. ఆ పై బీజేపీ పాత కాపుల్లో కొంద‌రు మంత్రి ప‌ద‌వుల‌ను ఆశిస్తూ ఉన్నారు. కొత్త వారికి ఇస్తే.. వాళ్లు అసంతృప్తులు కావొచ్చు.

ఇప్పుడు బీజేపీ అటు సెంట్ర‌ల్లో ఇటు క‌ర్ణాట‌క స్టేట్ లో ప‌వ‌ర్ లో ఉంది కాబ‌ట్టి.. ఎవ‌రూ ఎదురుతిర‌గ‌క‌పోవ‌చ్చు. కానీ అసంతృప్తి రేగ‌డానికి మాత్రం య‌డియూర‌ప్ప స్వ‌యంగా తేనెతుట్టెను క‌దుపుతున్న‌ట్టే అని ప‌రిశీల‌కులు అంటున్నారు.