Begin typing your search above and press return to search.

వైర‌స్ కోర‌లు: ఎమ్మెల్యే భార్య‌, వంట మ‌నిషి, డ్రైవ‌ర్, గ‌న్‌మెన్‌కు పాజిటివ్‌

By:  Tupaki Desk   |   13 Jun 2020 5:30 PM GMT
వైర‌స్ కోర‌లు: ఎమ్మెల్యే భార్య‌, వంట మ‌నిషి, డ్రైవ‌ర్, గ‌న్‌మెన్‌కు పాజిటివ్‌
X
తెలంగాణ‌లో మ‌హ‌మ్మారి వైర‌స్ తీవ్రంగా ప్ర‌బ‌లుతోంది. తాజాగా ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ఆ వైర‌స్ బారిన ప‌డ్డారు. టీఆర్ఎస్ ‌జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వైర‌స్ సోక‌డం క‌ల‌క‌లం రేపింది. నిన్న ఆయ‌న‌కు సోక‌గా ఇప్పుడు తాజాగా ఆయ‌న ఇంటిల్లిపాదికి సోకింది. తాజాగా ఆయన భార్య ప‌ద్మ‌ల‌త‌కు పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది. ఆమెతో పాటు డ్రైవర్‌, గన్‌మెన్‌, వంట మనిషికి కూడా కరోనా సోకింది. దీంతో వీరంతా హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు.

అయితే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రస్తుతం హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం జలుబు, దగ్గు రావడంతో ఆయ‌న‌ వైద్యులను సంప్రదించారు. ఈనెల 11వ తేదీన ప్రైవేట్‌ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో అదే ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి పాజిటివ్‌ రావడం రాష్ట్రంలో ఇదే తొలి కేసు.