Begin typing your search above and press return to search.

ఇదేం బాదుడు కేసీఆర్? కొండ మీద వాహనాన్ని గంట ఆపితే రూ.500?

By:  Tupaki Desk   |   1 May 2022 9:30 AM GMT
ఇదేం బాదుడు కేసీఆర్? కొండ మీద వాహనాన్ని గంట ఆపితే రూ.500?
X
ఏపీలోని తిరుమలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో తెలంగాణలో యాదగిరి గుట్టను డెవలప్ చేస్తామని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి పదే పదే రావటం తెలిసిందే. తాను కోరుకున్నట్లుగా యాదాద్రి కొండపైన సాములోరి దేవాలయాన్ని కొత్తగా తయారు చేయించి.. ఈ మధ్యలో సాధారణ భక్తులకు సైతం స్వామివారి దర్శనానికి పచ్చజెండా ఊపేయటంతో భారీ ఎత్తున భక్తులు యాదాద్రికొండ మీదకు పోటెత్తుతున్నారు.

ఇదిలా ఉండగా.. యాదాద్రి వెళుతున్న భక్తుల్లో అత్యధికులు వాహన పార్కింగ్ విషయంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వాహనాల్ని కొండ మీదకు అనుమతించకుండా.. కొండ కిందనే వాహనాల్ని ఉంచేసి.. దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్లలో వచ్చే వారు బస్సుల్లో ప్రయాణించి ఇబ్బందులు పడేందుకు ససేమిరా అంటున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం.. ప్రైవేటు వాహనాల్ని ప్రైవేటు వాహనాల్ని కొండ మీదకు అనుమతించినట్లే అనుమతిస్తూ.. దిమ్మతిరిగే నిర్ణయాన్ని తీసుకున్నారు. యాదాద్రికి వచ్చి సాములోరిని దర్శించాలనుకునే ప్రైవేటు వాహనాలకు సరికొత్త ఛార్జీని వడ్డిస్తున్నారు.

ఏదైనా కుటుంబం మొత్తం యాదాద్రికి తమ సొంత కారులో వెళ్లటం వరకు ఓకే. ఎప్పుడైతే యాదాద్రికి అడుగు పెడుతుందో.. అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో బాదుడు మొదలవుతుందని చెబుతున్నారు. ఒక ప్రైవేటు కారు కొండ మీదకు వెళ్లాలంటే.. వాహనాల పార్కింగ్ రుసుము మొదటి గంట రూ.500.. తర్వాతి ప్రతి గంటకు అదనంగా మరో రూ.100 చొప్పున వాసూలు చేయనున్నారు.

సాధారణంగా ఏ భక్తుడైనా సరే కొండ మీదకు వచ్చిన తర్వాత.. కుటుంబ సమేతంగా తమ వాహనంలో వస్తే ఇంత భారీగా బాదేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో స్వామివారి దర్శనానికి వచ్చే ప్రముఖులు.. సెలబ్రిటీల సొంత వాహనాలకు మాత్రం ఈ ఛార్జీ వాయింపులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణంగా సామాన్యుల్ని వదిలేసి.. సెలబ్రిటీల వద్ద వసూలు చేయాల్సింది.. అందుకు భిన్నగా సామాన్యుల్ని టార్గెట్ చేసి.. వాహన ఛార్జీల్ని భారీగా వసూలు చేయటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.