Begin typing your search above and press return to search.

XBB వేరియంట్ వెరీ డేంజర్: కరోనా పుకార్లపై కేంద్రం క్లారిటీ

By:  Tupaki Desk   |   22 Dec 2022 9:43 PM IST
XBB వేరియంట్ వెరీ డేంజర్: కరోనా పుకార్లపై కేంద్రం క్లారిటీ
X
చైనాలో లక్షల కేసులకు కారణమై మరణ మృదంగం వినిపిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ లోనూ వెలుగుచూడడం కలకలం రేపుతోంది. చైనాలో కరోనా విస్తరణకు కారణమవుతున్న ‘బీఎఫ్7’ కొత్త వేరియంట్ ఇప్పుడు భారత్ లోని గుజరాత్ లోనూ వెలుగుచూసింది. దేశంలో ఇలాంటివి రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం హైఅలెర్ట్ ప్రకటించింది.

కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కొత్తది వచ్చిందని.. దానివల్ల సగం జనాభా తుడిచిపెట్టుకుపోతోందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కోవిడ్ ఒమిక్రాన్ ఎక్స్ బీబీ వేరియంట్ వ్యాప్తి ప్రారంభమైందని.. అలాగే ఈ వేరియంట్ ప్రాణాంతకమైనదంటూ వాట్సాప్ గ్రూపులో ఓ వార్త వైరల్ గా మారింది. దీంతోపాటుగా ఎక్స్ బీబీ వేరియంట్ ను గుర్తించడం చాలా కష్టమని అందులో ఉంది. దీనివల్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని తేలింది. ఇది గతంలో వచ్చిన డెల్టా వేరియంట్ కన్నా ఐదురెట్లు ప్రమాదకరమైనది తేలింది. కాబట్టి జాగ్రత్త అవసరం అంటూ వార్తల్లో రాస్తున్నారు.

ఈ కొత్త XXB వైరస్ పై నెటిజన్లు భయాందోళనకు గురవుతున్నారు. ఇక.. ఈ వార్తపై కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ ఇచ్చింది. ఇది ఫేక్ వార్త అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ కొట్టిపారేసింది. ట్విటర్ వేదికగా దీనిపై స్పందించింది. ఒమిక్రాన్ ఎక్స్ బీబీ వేరియంట్ పై సోషల్ మీడియాలో ఫేక్ వార్త ప్రచారంలో ఉంది. ఈ వార్తలను ప్రజలు నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని సీరియస్ కామెంట్స్ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం అప్రమత్తంగా ఉన్నట్టు స్పస్టం చేసింది.

ఎక్స్ బీబీ వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. ఎక్స్ బీబీ వేరియంట్ వల్ల సోకే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.

కోవిడ్ -19 వేవ్ చైనాను అతాలాకుతలం చేస్తోంది. ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ఆందోళనల మధ్య చైనాలోని ఆసుపత్రులు నిండిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది.తీవ్రత తక్కువ అని చైనా అధికారులు చెబుతున్నప్పటికీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు బిజీగా ఉన్నాయని సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.