Begin typing your search above and press return to search.

కరోనా ఖతం..వూహాన్ వాసుల వింత చేష్టలు

By:  Tupaki Desk   |   29 March 2020 6:55 AM GMT
కరోనా ఖతం..వూహాన్ వాసుల వింత చేష్టలు
X
కరోనా మహ్మమారికి పుట్టినిల్లు చైనాలోని వూహాన్. గతేడాది డిసెంబర్ లో కరోనా వైరస్ వూహాన్లో ప్రబలింది. అక్కడి నుంచి క్రమంగా ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. కొన్నినెలలుగా వుహాన్‌ లో లాక్ డౌన్ విధించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు మాత్రం నమోదు కాలేదు. దీంతో రెండు నెలల తర్వాత వూహాన్ లో ఆంక్షలు ఎత్తివేశారు.

శనివారం వూహాన్ నగరంలో సిటీ బస్సులు తిరిగేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ సిటీ దాటి వెళ్లేందుకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో స్థానికులు రెచ్చిపోయారు. తమను బస్సులు - మెట్రోల్లో వెళ్లేందుకు అనుమతిచ్చి.. సిటీ దాటేందుకు మాత్రం పర్మిషన్ ఇవ్వకపోవడం దారుణమని వూహాన్ వాసులు మండిపడుతున్నారు. వుహాన్లోని హుబే ప్రావిన్స్‌లో పోలీసు వాహనాన్ని స్థానికులు పడేసి బీభత్సం సృష్టించారు. అధికారుల తీరును నిరసిస్తూ స్థానికులు ఆందోళనను దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

స్థానికులు - పోలీసుల మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. యంగ్జీ నది వంతెనపై అడ్డంగా ఉన్న అధికారులపై స్థానికులు విరుచుకుపడ్డారు. తమను ఆపుతారా? అంటూ పోలీసుల వాహనాన్ని బోల్తా కొట్టించారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీల ప్రతాపం చూపించారు. అయితే స్థానికులను హుబే నుంచి జియాంగ్జీలోకి ప్రవేశించడానికి అధికారులు నిరాకరించడంతో సమస్య ప్రారంభమైందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

చైనాలోని వూహాన్‌లో స్థానికులు వైరస్ బయటపడిన తర్వాత పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వం జనవరిలో 11మిలియన్ల మందిని లాక్డౌన్ చేశారు. రోడ్లను మూసివేసి - ఫెన్సింగ్ వేసి మరి వైరస్‌ ను అదుపులోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా వూహాన్ వాసులకు ప్రభుత్వ అధికారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే కరోనా మహమ్మరితో ప్రపంచ వ్యాప్తంగా 6లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 27వేల మందికి మృత్యువాత పడ్డారు. చైనాలో 80వేల మందికి వైరస్ సోకగా 3,200మంది మృత్యువాత పడినట్లు సమాచారం.

ప్రస్తుతం అమెరికాలో లక్ష కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన తొలి దేశంగా అమెరికా నిలిచింది. కరోనా దెబ్బకు ఇటలీ - స్పెయిన్ - యూకే దేశాలు విలవిలాడుతున్నాయి. ఇటలీలో మరణమృదంగం కొనసాగుతుంది. ప్రపంచమంతా ఓవైపు కరోనాతో భయాందోళన చెందుతుంటే వూహాన్ వాసులు వింత చేష్టలు ప్రపంచాన్ని మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయి.