Begin typing your search above and press return to search.

ప్రపంచం వణికేలా మానవాళికి ముప్పు తెచ్చింది వూహాన్ ల్యాబేనట!

By:  Tupaki Desk   |   15 Aug 2021 3:58 AM GMT
ప్రపంచం వణికేలా మానవాళికి ముప్పు తెచ్చింది వూహాన్ ల్యాబేనట!
X
అనుమానాలు మళ్లీ ముసురుకుంటున్నాయి. ప్రపంచ మానవాళిని తీవ్రంగా ప్రభావితం చేయటమే కాదు.. కోట్లాది మందిని పొట్టన పెట్టుకున్న మాయదారి వైరస్ పాపం వూహాన్ ల్యాబ్ దేనన్న మాట నిజమనిపించేలా ఒక పెద్ద మనిషి సంచలన అంశాల్ని బయటపెట్టాడు. వూహాన్ పశు మార్కెట్ లో పుట్టిన కొవిడ్ మహమ్మారి.. యావత్ ప్రపంచాన్ని కమ్మేయటం.. దీనికి కారణంగా యావత్ ప్రపంచం ఎంతలా తల్లడిల్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే.. కరోనాపై ప్రపంచం చేస్తున్న యుద్ధం.. మూడో ప్రపంచ యుద్ధానికి ఏ మాత్రం తీసిపోనిదిగా చెప్పాలి.

ఆ మాటకు వస్తే మొదటి.. రెండో ప్రపంచ యుద్ధాల్లో చాలా దేశాలు యుద్ధంలో పాల్గొనలేదు. మరికొన్ని దేశాలు అప్పటి సామ్రాజ్యవాద దేశాల్లో బంధీలుగా ఉండి.. వారు చెప్పినట్లు వినాల్సి వచ్చింది. కానీ.. ఇప్పుడు పరిస్థితులు వేరు. మొదటి.. రెండో ప్రపంచ యుద్ధాల వేళ చోటు చేసుకున్న వాటికి ఏ మాత్రం తీసిపోని రీతిలోనే పరిస్థితులు ఉన్నాయని చెప్పక తప్పదు. రెండు ప్రపంచ యుద్ధాల్లో తుపాకులు.. బాంబులు.. యుద్ధ విమానాల మోతలు భారీగా వినిపిస్తే.. ఇప్పుడు జరుగుతున్న మూడోప్రపంచ యుద్ధంలో కంటికి కనిపించనంత చిన్న శత్రువు.. యావత్ మానవాళికి సవాల్ విసురుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. దేశాలకు దేశాల ఆర్థిక పరిస్థితి మహా దారుణంగా మారుతోంది.

దీనంటికి కారణం అన్నంతనే చైనాలోని వూహాన్ మహానగరం వైపు వేలు చూపిస్తారు. అక్కడి జంతువుల మార్కెట్ లోనే ఈ మాయదారి వైరస్ పుట్టుకొచ్చినట్లుగా చెప్పే వాదనలన్ని కల్పితాలే అన్న విషయాన్ని నమ్మేలా ఒక పెద్ద మనిషి సంచలన అంశాల్ని వెల్లడించారు. యావత్ ప్రపంచం అనుమానిస్తున్నట్లే.. వూహాన్ లోని మాయదారి ల్యాబ్ లో సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా చేసిన కరోనా పరిశోధనలే తాజా పరిస్థితికి కారణమన్న విషయాన్ని వెల్లడించారు.

ఇంతకీ ఈ మాటలు చెప్పింది ఎవరు? ఆయన మాటల్ని ఎందుకంత విశ్వాసంలోకి తీసుకోవాలన్న విషయాన్ని చూస్తే.. ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున వూహాన్ ల్యాబ్ కు వెళ్లి పరిశీలించి వచ్చిన వ్యక్తి కాబట్టి. ఇంతకూ ఆయన ఎవరంటే.. పీటర్ బెన్ ఎంబరెక్. చైనాలో కరోనా వైరస్ ఆవిర్భావం గురించి దర్యాప్తు చేసేందుకు వెళ్లిన టీంలో ఈ పెద్దాయన ఒకరు. తాజాగా డానిష్ టీవీ 2 డాక్యుమెంటరీలో బెన్ ఈ సంచలన విషయాల్ని వెల్లడించారు. జూన్ లో రికార్డు చేసిన ఈ వీడియో ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

వూహాన్ లోని సముద్రజీవుల మార్కెట్లో జీవులకు.. మనుషఉలకు మధ్య కాంటాక్ట్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ మార్కెట్ కు కేవలం 500 మీటర్ల దూరంలోనే వూహాన్ సీడీసీ ల్యాబ్ ఉందన్నారు. గబ్బిలాల నమూనాలు సేకరించే సమయంలో ల్యాబ్ సిబ్బంది కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందన్న ఆయన.. ల్యాబ్ లో భద్రతా చర్యలపై ఆయన ఆందోలన వ్యక్తం చేశారు. బెన్ నోటి నుంచి వచ్చిన మాటల్ని చూస్తే.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన మహమ్మారి వూహాన్ ల్యాబ్ పుణ్యమేనన్న అభిప్రాయం మరోసారి స్పష్టం కాక మానదు.