Begin typing your search above and press return to search.

కరోనాపై వార్తలు రాస్తే ఖతమే! చైనాలో దాష్టీకాలు

By:  Tupaki Desk   |   18 Nov 2020 9:15 AM IST
కరోనాపై వార్తలు రాస్తే ఖతమే! చైనాలో దాష్టీకాలు
X
చైనాలో మీడియాపై దారుణమైన ఆంక్షలు ఉంటాయన్న సంగతి తెలిసిన విషయమే. కమ్యూనిస్ట్​ దేశమైనప్పటికీ చైనాలో మీడియాపై నియంత్రణ ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయడానికి వీల్లేదు. చైనాలోని వూహాన్​నగరంలో తొలిసారి కరోనా వైరస్​ బయటపడ్డ విషయం తెలిసిందే. అయితే అదే నగరానికి చెందిన మహిళా జర్నలిస్ట్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆమె కరోనాపై తప్పుడు సమాచారం ప్రచురించారని పోలీసులు వేధిస్తున్నారు.

లాయర్‌గా పనిచేసిన 37 సంవత్సరాల ఝాంగ్‌ ఝన్‌ ప్రస్తుతం జర్నలిస్ట్​గా కొనసాగుతున్నారు. కరోనాపై తప్పుడు వార్తలు రాశారంటూ మే నెలలో ఆమెను పోలీసులు అరెస్ట్​ చేశారు. ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ చైనా అధికారులు తరచూ ప్రజాస్వామికవాదులపై కేసులు పెడుతుంటారు.

ఇదే ఆరోపణలమీద ఝాంగ్‌ ఝన్‌ను కూడా పోలీసులు అరెస్ట్​ చేశారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో ముగ్గురు వ్యక్తులు కూడా కరోనాపై తప్పుడు వార్తలు రాసిన కేసులో అరెస్టయి ప్రస్తుతం కనిపించకుండా పోయారు. ఝాంగ్‌ ఝన్‌ వూహాన్‌కు వెళుతుండగా అదుపులోకి తీసుకున్నామని ఫిబ్రవరిలో ఆమె అరెస్టుకు దారి తీసిన పరిణామాలపై రాసిన ప్రభుత్వ నివేదికలో అధికారులు తెలిపారు. వూహాన్‌లో పరిస్థితులపై ఆమె అనేక కథనాలు రాశారు. వైరస్‌ బాధితుల కష్టాలు, వాటిని కవర్‌ చేస్తున్న జర్నలిస్టులపై అణచివేతలను కూడా ఆమె తన కథనాల్లో పేర్కొన్నారని చైనీస్‌ హ్యూమన్‌ రైట్స్‌ డిఫెండర్స్‌ (సీహెచ్‌ఆర్‌డీ) పేర్కొంది.

మే 14 నుంచి ఝాంగ్‌ ఝన్‌ కనిపించకుండా పోయారని సీహెచ్‌ఆర్‌డీ వెల్లడించింది. తనను షాంఘైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అంతకు ముందు రోజే ఆమె చెప్పారని సీహెచ్‌ఆర్‌డీ తెలిపింది.

జూన్‌ 19న షాంఘైలో ఆమెను అధికారికంగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడైంది. ఆ తర్వాత మూడు నెలలకు అంటే సెప్టెంబర్ 9న ఆమెకు తన లాయర్‌ను కలుసుకునే అవకాశం కల్పించారు. అక్రమంగా తనను బందీని చేశారని ఆరోపిస్తూ ఝాంగ్‌ ఝన్‌ నిరాహారదీక్ష చేస్తున్నారని సీహెచ్‌ఆర్డీ తెలిపింది.