Begin typing your search above and press return to search.

లంకలో ప్రధాని బెడ్ పై ఫైటింగ్, కుస్తీ.. వైరల్ ఫొటోలు

By:  Tupaki Desk   |   12 July 2022 5:52 AM GMT
లంకలో ప్రధాని బెడ్ పై ఫైటింగ్, కుస్తీ.. వైరల్ ఫొటోలు
X
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం పతాకస్థాయికి చేరింది. ప్రజలు రోడ్లెక్కి ఏకంగా అధ్యక్షుడి భవనాన్ని ముట్టడించారు. ఆందోళన మిన్నంటి అధ్యక్షుడి నివాసంలోనే తిష్టవేశారు. అక్కడే తిండి, నిద్ర, స్నానాలు, భోజనాలు ఇలా అన్నీ కానిచ్చేస్తున్నారు. శ్రీలంకలో ప్రధాని తాజాగా రాజీనామా చేయగా.. అధ్యక్షుడు చేస్తానని ప్రకటించి జనం ముట్టడితో పరార్ అయ్యాడు. ఆందోళనకారులు ప్రధాని ఇంటిని తగులబెట్టి అధ్యక్షుడి నివాసంలో తిష్టవేశారు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అధ్యక్షుడి ఇంట్లోని స్విమ్మింగ్ పూల్, డైనింగ్ హాల్ వద్దకు వచ్చిన జనం రచ్చ చేశారు. బెడ్ రూంలో సేదతీరారు. జిమ్ లో ఆడిపాడారు. ప్రధాని బెడ్ పై కుస్తీ పోటీలు.. ఫైటింగ్ నిర్వహించరుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచగా వైరల్ అయ్యింది.

తాజాగా ప్రధాని అధికార నివాసంలోని ప్రధాని పడుకునే బెడ్ పై కొందరు కుస్తీ పడ్డారు. ఆ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ కూడా రెజ్లింగ్ మ్యాచ్ కు సంబంధించిన ఆడియో లీక్ అయ్యింది. ఫ్రొఫెషనల్ రెజ్లర్ల మాదిరిగా కొట్టుకుంటూ కనిపించారు.

శ్రీలంక జనం నిరసనలతో ప్రధాని రాజీనామా చేయగా.. అధ్యక్షుడు పారిపోయాడు. పార్టీ కొత్త నేను ఎన్నుకోనుంది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే 13వ తేదీన రాజీనామా చేసేందుకు అంగీకరించారు. కానీ అతడి నివాసం వద్దు ఆందోళనకారులు రావడంతో పారిపోయాడు.

ఇక ఇటీవలే నియామకమైన ప్రధాని విక్రమసింఘే రాజీనామా చేశారు. ఆ వెంటనే మంత్రి బందుల గుణవర్ధన కూడా రాజీనామా చేశారు. ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది జర్నలిస్టులపై దాడి చేశారు. ఘటనను అంతా ఖండించారు.

ప్రధానమంత్రి నిద్రపోయే పడకపైనా కొందరు యువకులు ఎగురుతూ.. దొర్లుతూ ఫొటోలు తీసుకున్నారు. అక్కడున్న వ్యాయామశాలలో కసరత్తులు చేశారు. అధ్యక్షుడి బాత్రూంలో స్నానం చేస్తూ మరికొందరు కనిపించారు. అక్కడే భోజనాలు చేస్తున్నారు. పిల్లా పాపలతో కలిసి గడుపుతున్నారు.అధ్యక్ష భవనంలోని గదుల్లో నిరసనకారులకు భారీ స్థాయిలో నోట్ల కట్టలు కనిపించాయి. 'వెంటనే వాటికి లెక్కించి మొత్తం విలువ సుమారు రూ.8 కోట్లుగా తేల్చారు. ఆ సొమ్మును వారు స్థానిక పోలీసులకు అప్పగించారు. నగుదును లెక్కిస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

నిరసనకారులు అధ్యక్ష భవనంలోని రాజభవనాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. అక్కడి సోఫాలు, స్విమ్మింగ్ ఫూల్. ఖరీదైన బల్లల్లో, బెడ్ రూంలలో నిరసనకారులు తిష్టవేసి ఫొటోలు, వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు. ఆదివారం నిరసనకారులంతా అధ్యక్ష, ప్రధాని అధికారిక నివాసాల్లోనే గడిపారు. ప్రతీ గదిని పరిశీలిస్తూ.. సెల్ఫీలు తీసుకున్నారు. స్థానికులు కూడా వందలాదిగా ఆ భవనాలను చూసేందుకు తరలివచ్చారు. కుటుంబ సభ్యులు , పిల్లలతో తిరుగుతూ భోజనాలు కూడా అక్కడే చేశారు. యువకులు సోఫాల్లో కూర్చొని టీవీలు వీక్షిస్తూ గడిపారు.