Begin typing your search above and press return to search.

వావ్‌.. ‘ఖ‌తార్ పాప’‌కు సినిమా ఛాన్స్ వ‌చ్చింద‌ట‌గా!

By:  Tupaki Desk   |   13 April 2021 9:00 AM IST
వావ్‌.. ‘ఖ‌తార్ పాప’‌కు సినిమా ఛాన్స్ వ‌చ్చింద‌ట‌గా!
X
‘షాలిని బుజ్జి’ అంటే బహుశా ఎవ్వ‌రికీ తెలియ‌క‌పోవ‌చ్చు.. కానీ, ‘ఖ‌తార్ పాప‌’ అంటే మాత్రం చాలా మందికి తెలుసు. ముఖ్యంగా.. ‘టిక్ టాక్’ వీడియోల్లో ప్రవేశం, ప్రావీణ్యం ఉన్నోళ్లకు సుపరిచితురాలే. ఇప్పుడంటే టిక్ టాక్ లేక అల్లాడుతున్నారుగానీ.. అప్ప‌ట్లో ఆ యాప్ ద్వారా ఔత్సాహికులు చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. డైలాగ్స్ మొద‌లు డ్యాన్స్ లు, డ‌బ్ స్మాష్ వ‌ర‌కు దుమ్ములేపేవారు. అలాంటి వారిలో ఫేమ‌స్ అయిన అమ్మాయి ఖ‌తార్ పాప ఉర‌ఫ్ షాలిని బుజ్జి.

ఈ యువ‌తి స్పెషాలిటీ ఏమంటే.. నాటు బూతుల‌ను నీటుగా ప్ర‌జెంట్ చేయ‌డం. ఎవ‌రైనా త‌న‌ను కామెంట్ చేస్తే చాలు.. ప‌చ్చి బూతుల‌తో రెచ్చిపోయేది. నీట్ గా డ్రెస్ చేసుకొని.. ఊర మాస్ బిహేవియ‌ర్ చూపించేది. అంతేకాదు.. మ‌సాలా పాట‌ల‌కు హాట్ డ్యాన్స్ కూడా చేసేది. ఆ విధంగా టిక్ టాక్ తోపాటు సోష‌ల్ మీడియాలోనూ ఫేమ‌స్ అయ్యింది షాలిని. మీమ్స్ చేసే వారు ఖ‌తార్ పాప వీడియోల‌ను, ఫొటోల‌ను ఉప‌యోగించుకునే రేంజ్ కు వెళ్లింది.

అయితే.. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. ‘నాకో సినిమా ఛాన్స్ వ‌చ్చిందోచ్‌..’ అంటూ ఆనందంగా ప్ర‌క‌టిస్తోంది షాలిని. అంతేకాదు.. తాను బుద్ధిమంతురాలిగా మారిపోయాన‌ని కూడా చెబుతోంది. ఇక‌మీద బూతులు మాట్లాడ‌న‌ని, ఎక్స్ పోజింగ్ కూడా చేయ‌న‌ని ప్రామిస్ చేస్తోంది. అంతేకాదు.. సినిమాలో త‌న డైలాగు కూడా ఒక‌టి వ‌దిలింది. అయితే.. సినిమా పేరేంటీ? మేకర్స్ ఎవ‌రు? అనే విష‌యాలు మాత్రం చెప్ప‌లేదు. చూడాలి మ‌రి అది ఏ సినిమానో.. ఎప్పుడొస్తుందో?