Begin typing your search above and press return to search.
టైం చెప్పి మరీ మోడీ మాష్టారు టీజరు వదిలితే.. చివరికి అంతే
By: Tupaki Desk | 21 Oct 2020 1:20 PM ISTదేశంలో ఇప్పటివరకు పలువురు ప్రధాన మంత్రులు వచ్చారు. వెళ్లారు. అయితే.. వీరందరికి కాస్త భిన్నమైన ప్రధానిగా నరేంద్ర మోడీని చెప్పాలి. ప్రధానమంత్రులు ఉండే తీరుకు ఆయన భిన్నంగా వ్యవహరిస్తారు. ప్రధాని స్థానంలో ఉన్న వారు సాధారణంగా చేసే చాలా పనుల్ని ఆయన చేయకపోవటం మోడీ ప్రత్యేకతగా చెప్పాలి. అంతేకాదు.. ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటే.. దానికి భారీ బజ్ వచ్చేలా చేయటం ఆయనకు మాత్రమే చెల్లు.
తాను తీసుకున్న కీలక నిర్ణయాల్ని ప్రకటించేందుకు.. షాకింగ్ పరిణామాలకు రాత్రి ఎనిమిది తర్వాత ముహుర్తం ఎంచుకునే ఆయన.. పొద్దున్నే కానీ.. సాయంత్రం కానీ తాను మాట్లాడతానని.. ప్రిపేర్ చేసినప్పుడు షాకింగ్ నిర్ణయాలు పెద్దగా ఉండవు. తాజాగా అదే విషయాన్ని మరోసారి నిరూపించారు ప్రధాని మోడీ. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు మీకో విషయం చెబుతా? అంటూ చేసినపోస్టుకు చాలానే ఆసక్తి వ్యక్తమైంది.
అయితే.. మోడీ గురించి తెలిసిన వారు మాత్రం.. పెద్దగా ఏమీ ఉండవు చూడండన్న మాటను చెప్పారు. అందుకు తగ్గట్లే..కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న మాటను ప్రధాని మోడీ చెప్పారు. సాధారణంగా ఏదైనా సంచలన నిర్ణయాల్ని ప్రకటించాలనుకుంటే మాత్రం.. రాత్రి తొమ్మిది తర్వాతే ముహుర్తాన్ని ఎంచుకుంటారని చెబుతారు. దీనికి తగ్గట్లేపెద్ద నోట్ల రద్దుతో పాటు.. పలు అంశాల్ని రాత్రి వేళలోనే చెప్పటం గమనార్హం.
కరోనా టైంలో ఇప్పటివరకు ఏడుసార్లు మోడీ మాష్టారు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అయితే.. టీజర్ వదిలి.. భారీ బజ్ చోటు చేసుకున్న సందర్భంలో అంచనాలకు ఏ మాత్రం పొంతన లేకుండా ఆయన మాటలు ఉంటాయని చెబుతారు.తాజాగా చేసిన ప్రసంగాన్నే తీసుకుంటే.. ప్రత్యేకంగా చెప్పిందేమీ లేదు. ఆ మాటకు వస్తే.. కరోనా ను జాగ్రత్తగా అబ్జర్వు చేసే చాలామందికి మోడీ మాష్టారు చెప్పిన మాటలు తెలిసినవే. అయినప్పటికి తానేదో కొత్త విషయాన్ని చెబుతున్నట్లుగా చెప్పే వైనం నాటకీయంగా ఉంటుందే తప్పించి.. మరింకేమీ ఉండదన్న మాట వినిపిస్తోంది.