Begin typing your search above and press return to search.

నగ్నంగా పూజలు చేస్తే రూ. 50 కోట్లు...మైనర్ బాలికతో క్షుద్రపూజలు , !

By:  Tupaki Desk   |   1 March 2021 4:00 PM IST
నగ్నంగా పూజలు చేస్తే రూ. 50 కోట్లు...మైనర్ బాలికతో క్షుద్రపూజలు , !
X
ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా నగ్నంగా పూజ చేస్తే క్షణాల్లో కనకవర్షం కురుస్తుంది అని , రూ. 50 కోట్లు సొంతం అవుతుంది అని చెప్పి, ఓ మైనర్ పై వేధింపులకు పాల్పడ్డ ఐదుగురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో వెలుగు లోకి వచ్చిన ఈ దారుణ ఘటనలో క్షుద్రపూజల చట్టం కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ఓ వ్యక్తి మైనర్ అయిన ఓ బాలిక ను కలిసి , ఆ అమ్మాయి తో మాటలు కలిపి తాను చెప్పినట్లు చేస్తే క్షణాల్లో ధనవంతురాలు అవుతావు అంటూ మాయమాటలు చెప్పాడు. రూ. 50 కోట్లు డబ్బు వర్షం కురుస్తుందంటూ నమ్మించాడు. అయితే దానికోసం కొన్ని పూజలు చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు. అది నమ్మిన బాలిక పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అంగీకరించింది. అయితే, పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో బాలిక దస్తులు విప్పాలని సదరు వ్యక్తి చెప్పాడు. దాంతో పరిస్థితిపై అనుమానం వ్యక్తం చేసిన బాలిక వారు చెప్పినట్టు బట్టలు తీయడానికి ఒప్పుకోలేదు.

కానీ, డబ్బులు కావాలంటే దుస్తులు విప్పాల్సిందే అంటూ సదరు వ్యక్తి తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారు. దాంతో బాలిక వారి చెర నుంచి తప్పించుకుని పోలీసులకి ఈ విషయాన్ని తెలిపింది. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన వెనుక మొత్తం ఐదుమంది ఉన్నట్టు నిర్థారించుకున్నారు. వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురు నిందితులపై అసాంఘీక కార్యక్రమాలు, క్షుద్రపూజలు, లైంగిక నేరం, పోక్సో చట్టం, 354 (ఐపిసి) ఎ), 354 (డి) కింద కేసులు నమోదు చేశారు.