Begin typing your search above and press return to search.

ఓరుగల్లు కళా ప్రతిభకు ప్రపంచవ్యాప్త గుర్తింపు

By:  Tupaki Desk   |   6 Sept 2022 6:12 PM IST
ఓరుగల్లు కళా ప్రతిభకు ప్రపంచవ్యాప్త గుర్తింపు
X
ప్రాచీన కాలం నుంచి ఆలయాలు.. మన సాంస్కృతిక వైభవాలు.. ఆలయాల్లోనే మన సంస్కృతి, కట్టుబాట్లు, మన ఆచార వ్యవహారాలు తెలిసేవి. ఇప్పటికే ఏ ఆలయం ఏ రాజు కట్టించాడన్నది ఈజీగా తెలిసిపోతుంది. చోళులు, పాండ్యులు, కాకతీయులు ఇలా ఏ రాజులు వారి వారి ప్రత్యేక శైలితో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారు. కాకతీయుల కళావైభవం ప్రఖ్యాతి గాంచింది. వారి వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయం చరిత్రకెక్కింది. వీటికి ఇప్పుడు ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కింది.

కాకతీయులు పాలించిన ఓరుగల్లు ఇప్పుడు ప్రపంచ గుర్తింపు పొందింది. తెలంగాణలోని వరంగల్ నగరానికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యూనెస్కో) గుర్తించిన అభ్యాసన నగరాల ప్రపంచ నెట్ వర్క్ లో వరంగల్ నగరానికి చోటు లభించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ ద్వారా తెలిపారు.

భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందేలా నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు వరంగల్ తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.

దీనిపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఓరుగల్లు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గుర్తింపు కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.

ములుగు జిల్లాలోని కాకతీయ రుద్రేశ్వర రామప్ప ఆలయాన్ని ఇప్పటికే యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన సంగతి తెలిసిందే. అద్భుత శిల్పకళా సంపదనకు కొలువైన ఈ కాకతీయుల నాటి ఆలయానికి వారసత్వ సంపదగా గుర్తింపు దక్కినట్లయ్యింది. ఏడాది వ్యవధిలోనే వరంగల్ కు కూడా యూనెస్కో గుర్తింపు లభించడం విశేషం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.