Begin typing your search above and press return to search.

ప్రపంచ వ్యాప్తంగా కోటి 64 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య!

By:  Tupaki Desk   |   27 July 2020 10:45 AM IST
ప్రపంచ వ్యాప్తంగా కోటి 64 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య!
X
ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. కరోనా ప్రస్తుతం ఏ దేశాన్నీ వదలట్లేదు. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. కాగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఆదివారం కొత్తగా మరో 2,10,430 కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కరోనా‌ కేసుల సంఖ్య 1,64,12,815కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ 6,52,039 మంది కరోనా వైరస్ ‌తో మ‌ర‌ణించారు. ప్రస్తుతం 57,18,414 యాక్టీవ్ కేసులు ఉండగా, కోటి మందికి పైగా కరోనా నుండి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కూ దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 43,71,839కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 1,49,849 మంది మృతి చెందారు. ఇక భారత్ లో కరోనా జోరు కొనసాగుతుంది. కాగా , భారత్ ఇప్పటికే క‌రోనా కేసుల్లో ప్ర‌పంచంలో 3వ స్థానానికి చేరింది . గత 24 గంటల్లో భారత్‌లో 49,931 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 708 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 14,35,453కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 32,771కి పెరిగింది. 4,85,114 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 9,17,568 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 4,85,114 గా ఉంది. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 2.3 శాతంగా ఉంది. అలాగే, రికవరీ రేటు 63.9 శాతంగా ఉంది. రోజురోజుకూ రికవరీ రేటు పెరుగుతోంది. టెస్టుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 515472 టెస్టులు చేశారు. 24 గంటల్లో 5 లక్షలకు పైగా టెస్టులు చెయ్యడం దేశంలో ఇదే తొలిసారి. రోజువారీ నమోదవుతున్న కేసుల్లో అమెరికా తరవాత భారత్ రెండో స్థానానికి చేరుకుంది.