Begin typing your search above and press return to search.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం

By:  Tupaki Desk   |   24 July 2020 9:30 AM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. రోజురోజుకి కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది.ఈ వైరస్ లాక్ డౌన్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం అవుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,56,51,599కి చేరింది. గురువారం ఒక్కరోజే ఏకంగా 2,77,983 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో 6.36 లక్షల మంది మరణించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 54.79 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. 95.35 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.

అమెరికాలో కరోనా అల్లకల్లోలంగా మారింది. రోజురోజుకి కొత్త కేసులు జెట్ స్పీడుగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 69116 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 41,69,991 కేసులకు చేరాయి. వైరస్ వల్ల ఇప్పటివరకు అమెరికాలో 1,47,333మంది మఋతి చెందారు.

ఇక అమెరికా తర్వాత బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లండ్, స్పెయిన్ , లండన్,పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి.

భారత్ లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రపంచంలోనే 3వ స్థానానికి ఇండియా చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 45720 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 12,38,635కి చేరింది. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 24 గంటల్లో 1129మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 29861కి చేరింది.