Begin typing your search above and press return to search.

పెగాసస్‌ స్పైవేర్‌ తో ప్రపంచ వ్యాప్తంగా ఇన్ని చేశారట

By:  Tupaki Desk   |   30 Jan 2022 11:30 AM GMT
పెగాసస్‌ స్పైవేర్‌ తో ప్రపంచ వ్యాప్తంగా ఇన్ని చేశారట
X
కొంతకాలం క్రితం భారత రాజకీయాల్లో సంచలనంగా మారటమే కాదు.. తీవ్ర కలకలాన్ని రేపిన పెగాసస్‌ స్పైవేర్‌ ఇష్యూ మరోసారి వచ్చింది. కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల వేళ.. అధికార మోడీ సర్కారుకు దిమ్మ తిరిగేలా పంచ్ ఇస్తూ.. పెగాసస్‌ స్పైవేర్‌ ను భారత్ లోని మోడీ సర్కారు కొనుగోలు చేసిందని పేర్కొంటూ ప్రఖ్యాత అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. దీంతో పెగాసస్‌ స్పైవేర్‌ మీద చర్చ మళ్లీ షురూ అయ్యింది.

ఇప్పటివరకే దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న వారెవరూ చేయని రీతిలో.. ఇజ్రాయెల్ పర్యటనకు మోడీ వెళ్లటం.. ఈ సందర్భంగా జరిగిన డీల్ లో.. పెగాసస్‌ స్పైవేర్‌ కొనుగులు చేయటం ఒకటని చెబుతున్నారు. ఇదే విషయాన్ని తాజా సంచలన కథనంలోనూ పేర్కొన్నారు. ఈ స్పైవేర్ ఎంత పవర్ ఫవర్ ఫుల్ అన్న విషయాన్ని తాజా కథనంలో వివరిస్తూ.. దీని సాయంతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు తమ ఎజెండాకు తగ్గట్లుగా వ్యవహరించాయని పేర్కొన్నారు.

వివిధ దేశాల్లో తమ ప్రత్యర్థులను తొలగించుకోవటానికి కొన్ని అధికారపక్షాలు వాడితే.. మరికొన్ని ప్రభుత్వాలు ఉగ్ర మూకల్ని ఏరి వేయటానికి ప్రయోగించారు. రాజకీయ నేతలు.. నేరస్తులతో పాటు తమకు కొరుకుడుపడని జర్నలిస్టులు.. సామాజిక వేత్తలు.. ఉద్యమకారుల్ని దెబ్బ తీసేందుకు పెగాసస్‌ స్పైవేర్‌ వాడినట్లుగా న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది. ఇందులో పేర్కొన్న దాని ప్రకారం.. ఇంతకాలం ఈ స్పైవేర్ సాయంతో ఏమేం జరిగాయన్నది చూస్తే..

- మెక్సికో ఎల్‌ చాపో అనే ఒక మాదక ద్రవ్యాల మాఫియా నేత అరెస్టు
- దారుణ నేరాలకు పాల్పడే నేరస్తులతో పాటు జర్నలిస్టులు.. రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా మెక్సికో ప్రభుత్వం ఈ స్పైవేర్ వాడింది
- యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లో పౌర హక్కుల కార్యకర్తల ఫోన్లను హ్యాక్‌ చేసి వారిని జైళ్లలో పెట్టేందుకు ఉపయోగించారు.
- పలు యూరోపియన్‌ పరిశోధక సంస్థలు కూడా ఉగ్రవాద దాడుల్ని, సంఘటిత నేరాల్ని, అంతర్జాతీయంగా పసిపిల్లల సెక్స్‌ రాకెట్‌ ను భగ్నం చేసేందుకు దీన్ని వినియోగించారు
- సౌదీ అరేబియా... మహిళా హక్కుల కార్యకర్తలకు వ్యతిరేకంగా పెగాసస్‌ ను వాడింది.
- వాషింగ్టన్‌ పోస్ట్‌ కు చెందిన కాలమిస్టు జమాల్‌ ఖషోగ్గిపై నిఘా వేసి హత్యకు సైతం సౌదీ ఏజెన్సీలు పెగాస్‌సను వాడాయి.
- పెగాసస్‌ స్పైవేర్‌ను ఉగ్రవాదులు వినియోగిస్తున్నట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించి.. తమ దౌత్యవేత్తల ఫోన్లను దీని ద్వారా హ్యాక్ చేశారు.
- మా అధికారులు ఉపయోగిస్తున్న యాపిల్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్లలోకి అత్యాధునికమైన మాల్‌వేర్‌ను చొప్పించినట్టు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి జెర్నో సరేవా చెప్పారు.