Begin typing your search above and press return to search.

టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ వాయిదా.. ఐపీఎల్‌కు సుగ‌మం.. పాకిస్థాన్ ఆగ్ర‌హం‌

By:  Tupaki Desk   |   28 May 2020 8:50 AM GMT
టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ వాయిదా.. ఐపీఎల్‌కు సుగ‌మం.. పాకిస్థాన్ ఆగ్ర‌హం‌
X
ప్ర‌స్తుత విప‌త్కర ప‌రిస్థితిలో క్రీడా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌లేమ‌ని అన్ని క్రీడ‌ల శాఖ‌లు, అధికారులు ప్ర‌క‌టిస్తున్నారు. అంత‌టి ఒలంపిక్స్ టోర్న‌మెంట్ నిర్వ‌హ‌ణపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. అది కూడా వాయిదా ప‌డే అవ‌కాశం ఉంది. అయితే అంత‌క‌న్నా ముందు టీ-20 క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్ వాయిదా ప‌డింది. మ‌హ‌మ్మారి వైర‌స్ విజృంభిస్తున్న స‌మ‌యంలో ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు నిర్వ‌హించాల‌నుకున్న టీ20 ప్రపంచకప్‌ వాయిదా వేస్తున్న‌ట్లు నిర్ణ‌యం వెలువ‌డింది. అన్ని దేశాల బోర్డు సభ్యులతో నిర్వహించనున్న టెలీ కాన్ఫరెన్స్‌ అనంతరం ఐసీసీ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్రకటించనుంది. ప్ర‌పంచ‌క‌ప్ వాయిదా ప‌డ‌డంతో అక్టోబర్‌, నవంబర్ నెల‌ల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) నిర్వహణ‌కు మార్గం ల‌భించిన‌ట్టు అయ్యింది. అయితే ప్ర‌పంచ‌క‌ప్ వాయిదా వేయ‌డంపై పాకిస్థాన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఇది తొందరపాటు నిర్ణయమ‌ని పాకిస్తాన్ పేర్కొంది. పరిస్థితులను ఆలోచించుకుని టోర్నీ నిర్వ‌హ‌ణ‌పై ఆలోచ‌న‌లు చేయాల‌ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. క్రికెట్‌ క్యాలెండర్‌ ప్రకారం పాక్‌, విండీస్‌ జట్లు ఇంగ్లండ్‌లో సిరీస్‌ ఆడే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌క‌ప్ వాయిదా తో ఆ సిరీస్ లేక‌పోయే అవ‌కాశం. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కోసం ప్ర‌పంచ‌క‌ప్ వాయిదా వేస్తామంటే అంగీక‌రించ‌మ‌ని పాక్ ప్ర‌క‌టించింది. ఐసీసీ ఈవెంట్స్‌, ద్వైపాక్షిక సిరీస్‌లకు మాత్రమే మేము ప్రాధాన్యత ఇస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.