Begin typing your search above and press return to search.

ఆసుపత్రిలో చేరిన విశ్వనటుడు.. ఇప్పుడెలా ఉంది?

By:  Tupaki Desk   |   18 Jan 2022 9:37 AM IST
ఆసుపత్రిలో చేరిన విశ్వనటుడు.. ఇప్పుడెలా ఉంది?
X
విశ్వనటుడిగా సుపరిచితుడు.. భారత సినీ రంగంలో గర్వించదగ్గ నటుడిగా పేరున్న కమల్ హాసన్ తాజాగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన శ్రీరామచంద్ర ఆసుపత్రిలో ఆయన చేరారు. ఓపక్క సినీ నటుడిగా.. మరోవైపురాజకీయ నేతగా.. ఇంకో వైపు బిగ్ బాస్ తమిళ్ సీజన్ 5కు హోస్టు చేస్తున్న ఆయన.. ఈ ఆదివారమే సీజన్ ను విజయవంతంగా పూర్తి చేశారు.

ఇలా షో పూర్తి అయ్యిందో లేదో.. ఆయన్నుఆసుపత్రికి తరలించటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్యం బాగా లేకపోవటంతో ఆసుపత్రిలో చేర్చారు. తాజాగా ఆయనకు కరోనా బారిన పడటం.. అందులో నుంచి విజయవంతంగా బయటకు రావటం తెలిసిందే. దీంతో.. ఆయన్ను అమితంగా అభిమానించే వారంతా ఊరట చెందారు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఆయన్ను ఆసుపత్రిలో చేర్చటం.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమయ్యేలా సమాచారం వైరల్ అయ్యింది. అయితే.. కమల్ హాసన్ కు ఏమీ కాలేదని.. ఆయన ఆసుపత్రిలో రెగ్యులర్ గా చెకప్ కోసమే ఆసుపత్రికి వచ్చినట్లుగా చెబుతున్నారు. అతకుమించి ఎలాంటి అనారోగ్యం లేదన్న మాట వినిపిస్తోంది.

ఇదే నిజమైతే.. ఒక చక్కటి ట్వీట్ తోనో.. మరో ఆసక్తికర పోస్టుతోనూ ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెప్పేసి.. అనవసరమైన టెన్షన్ నుంచి అభిమానుల్నితప్పిస్తే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. నిజమే.. ఆ వాదనలోనూ న్యాయముందని చెప్పాలి.