Begin typing your search above and press return to search.
స్మార్ట్ సిటీస్ రేసులో మన నగరాలు వెనుకంజ!
By: Tupaki Desk | 18 Sept 2020 3:00 PM ISTప్రపంచ స్మార్ట్ సిటీల జాబితాలో భారతదేశంలోని ప్రధానమైన నగరాలుగా వెలుగొందుతున్న మహానగరాలు కొంచెం వెనుకంజ వేశాయి. ఈ ప్రపంచ స్మార్ట్ సిటీల జాబితా లో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. ఐఎండీ, ఎస్ యూటీడీలు సర్వే చేసి 2020 స్మార్ట్ సిటీ జాబితాను తయారు చేశాయి. ఈ జాబితాలో గతేడాదితో పోలిస్తే భారతీయ నగరాల ర్యాంకులు కొంచెం కిందకి వచ్చేశాయి. జాబితాలో హైదరాబాద్ 85, న్యూఢిల్లీ 86, ముంబై 93, బెంగళూరు 95వ స్థానాల్లో నిలిచాయి. అయితే , గత ఏడాది ఇవే నగరాలు వరుసగా 67, 68, 78, 79 స్థానాలు దక్కించుకున్నాయి. కరోనా సంక్షోభానికి తయారుగా లేకపోవడంతో దేశీయ నగరాలు ఇబ్బంది పడ్డాయని సర్వే వెల్లడించింది.
సాంకేతికత అంతగా లేని చోట కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని , భారతీయ నగరాలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య వాయు కాలుష్యమని ఇక్కడ నివసించేవారు అభిప్రాయపడ్డారు. వాయు కాలుష్యం తర్వాత హైదరాబాద్, ఢిల్లీలో కనీస సౌకర్యాలు లేకపోవడం, ముంబై, బెంగళూరుల్లో ఇరుకు రోడ్లు ప్రధాన సమస్యలుగా నిలిచాయి. అంతర్జాతీయంగా చూస్తే జాబితాలో సింగపూర్ తర్వాత హెల్సిన్కి, జ్యూరిచ్, ఆక్‌లాండ్, ఓస్లో, కోపెన్‌హాగెన్, జెనీవా, తైపీ, ఆమ్‌స్టర్‌డామ్, న్యూయార్క్ లు నిలిచాయి. జాబితా రూపొందించడం కోసం ప్రతి నగరంలో వందలాదిమందిని సర్వే చేశారు. సర్వే కోసం 15 సూచికలను వాడారు. కీలకంగా ఆరోగ్యం, భద్రత, రవాణా, అవకాశాలు, పాలన తదితర అంశాల్లో సాంకేతికత వినియోగంపై సర్వేలో ఎక్కువ దృష్టి పెట్టారు. స్మార్ట్ సిటీలపై కరోనా ప్రభావం తీసివేయలేనిదని, సాంకేతికత బాగా ఉన్న చోట్ల ప్రభావం తక్కువని ఐఎండీ ప్రొఫెసర్ అర్టురోబ్రిస్ చెప్పారు.