Begin typing your search above and press return to search.
ప్రపంచ పరుగు వీరులు ఇండియాలో.. ఒలంపిక్స్ రికార్డు బద్ధలు!
By: Tupaki Desk | 13 Feb 2021 7:00 AM ISTప్రపంచ నెంబర్ వన్ రన్నర్ ఎవరంటే.. అందరూ ఉసేన్ బోల్ట్ పేరు చెబుతారు! తన వేగంతో ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన బోల్ట్.. 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.8 సెకన్లలో రీచ్ అయ్యాడు బోల్ట్. దీంతో.. ప్రపంచం మొత్తం నోరెళ్లబెట్టి చూసింది. జమైకన్ చిరుతగా నామకరణం చేసేసింది. అయితే.. ఆ రికార్డును భారతీయులు అవలీలగా ఛేదిస్తున్నారు! అది కూడా సాధారణమైన మైదానంలో కాదు.. పిక్కలు మునిగే బురద మడుల్లో! గతేడాదే ఇద్దరూ పరుగు వీరులు బోల్ట్ రికార్డును తుడిపేయగా.. తాజాగా మరో వీరుడు సరికొత్త రికార్డును నమోదు చేశాడు! ఇదంతా ఎలా సాధ్యమవుతోంది? రికార్డులు ఎక్కడ నమోదవుతున్నాయి? అనే వివరాలు తెలియాలంటే.. మనం అంబరాన్నంటే కంబళం గురించి తెలుసుకోవాల్సిందే!
కర్ణాటకలోని ఉత్తర, దక్షిణ కన్నడ జిల్లాలను కరావళి ప్రాంతంగా పిలుస్తుంటారు. అక్కడి సాంప్రదాయ క్రీడనే కంబళ. ఈ క్రీడకు శతాబ్ధాల చరిత్ర ఉంది. నవంబర్‌లో మొదలయ్యే ఈ క్రీడలు వివిధ ప్రాంతాల్లో వివిధ రోజుల్లో నిర్వహిస్తూ మార్చి వరకు కొనసాగిస్తారు. 100 మీటర్ల నుంచి అంతకన్నా ఎక్కువ దూరంలో ఈ పోటీలు నిర్వహిస్తారు. ఆ పోటీలు జరిగే ప్రాంతాలను చదును చేసి, అందులో బురద నింపుతారు. అందులో దున్నపోతులను పరిగెత్తిస్తూ, వాటి వెంట మనిషి పరిగెత్తాలి. ఎవరైతే తక్కువ సమయంలో టార్గెట్ రీచ్ అవుతారో వారే విజేత.
ఈ కంబళ పోటీల్లో మొత్తం ఏడు రకాల పోటీలుంటాయి. బారే కంబళ, కోరి కంబళ, అరసు కంబళ, దెవెరే కంబళ, బాలె కంబళ, కెరె కంబళ, కాద్రి కంబళగా నిర్వహిస్తుంటారు. అయితే.. బురదలో పరిగెత్తేవి మాత్రం రెండే రకాలు. ఈ బురద పరుగు పోటీల్లో ఏకంగా ఒలింపిక్స్ పరుగు రికార్డులు బద్ధలవుతున్నాయి. గతేడాది జరిగిన పోటీల్లో వంద మీటర్ల దూరాన్ని శ్రీనివాసగౌడ 9.55 సెకన్లలో, నిశాంత్ శెట్టి 9.51 సెకన్లలో ఛేదించి సరికొత్త రికార్డును సృష్టించారు. తాజాగా.. వంద మీటర్ల దూరాన్ని కేవలం 9.15 సెకన్లలో పూర్తిచేసిన విశ్వనాథ్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. మొత్తం 125 మీటర్ల దూరాన్ని 11.44 సెకన్లలో పూర్తి చేశాడీ ఘటికుడు. కాగా.. ఒలింపిక్స్ వీరుడు ఉసేన్ బోల్డ్ వంద మీటర్ల దూరాన్ని 9.58 సెకన్లలో రీచ్ అయిన విషయం తెలిసిందే.
పోటీలో రకాలు ఇవే..
కంబళ పోటీలను పలు భాగాలుగా విభజిస్తారు. వాటిలో నెగిలు, హగ్గ, హాలేజ్, అడ్డా, కేన్ హాలేజ్ ముఖ్యమైనవి. ఒక్కో రకమైన పోటీకి ఒక్కో విధమైన ఏర్పాట్లు ఉంటాయి.
హగ్గ పోటీలుః ఈ పోటీల్లో పాల్గొనే దున్నలకు బలమైన తాడును కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఇందులో ఓ వ్యక్తి చేతిలో తాడుతో దున్నలను లక్ష్యం దిశగా పరిగెత్తిస్తూనే.. వాటితో పాటు బురదలో పరిగెడతారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో ఈ పోటీ నిర్వహిస్తారు.
అడ్డా హాలేజ్: ఈ విభాగం చాలా కఠినంగా ఉంటుంది. వంకర తిరిగినటువంటి ఒక చెక్కను దున్నపోతుల కడతారు. ఆ చెక్కపలకపై పోటీదారు నిలబడి ఉంటాడు. ఆ దున్నలు పెరిగెడుతుంటే.. దానిపై నిలబడి దున్నను కంట్రోల్ చేస్తూ టార్గెట్ రీచ్ అవ్వాల్సి ఉంటుంది. తేడావస్తే గాయాలపాలవడం కూడా ఉంటుంది. అందుకే.. ఈ విభాగంలో సీనియర్ రౌండ్ మాత్రమే ఉంటుంది.
నెగిలు: ఈ రకం క్రీడలో.. చెక్కగానీ ఇనుముతోగానీ తయారు చేసిన భారీ నాగలిని దున్నపోతుకు కట్టి బురదలోకి దింపుతారు. వాటి వెనక పరిగెత్తుతూ గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఇందులో తొలిసారి పోటీలో పాల్గొనేవారు కూడా ఉంటారు.
కేన్ హాలేజ్: ఈ రకం పోటీలు మాత్రం చాలా సీరియస్ గా, ఉత్కంఠగా ఉంటాయి. తయారు చేసిన గుండ్రటి చెక్కను దున్నలకు కడతారు. చెక్కకు మధ్యలో రెండు ప్రత్యేకమైన రంధ్రాలు ఏర్పాటు చేస్తారు. దున్నలు పరిగెత్తే సమయంలో ఈ రెండు రంధ్రాల నుంచి చిమ్మే నీటి ఎత్తు, వేగంతో విజేతను ఎన్నుకుంటారు. ఇందులో సూపర్ సీనియర్ రౌండ్ మాత్రమే ఉంటుంది. మిగిలిన వారికి అవకాశం ఉండదు. ఈ విధంగా కన్నడ రాష్ట్రంలో మాత్రమే సాగే ఈ పోటీలు.. పరుగులో ప్రపంచ రికార్డులు బద్దలవుతుంటే.. విశ్వవ్యాప్తంగా పరిచయం అవుతున్నాయి.