Begin typing your search above and press return to search.

ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ న్యూస్.. కరోనా కోరలు అలా పీకలేరట

By:  Tupaki Desk   |   18 April 2020 9:20 AM IST
ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ న్యూస్.. కరోనా కోరలు అలా పీకలేరట
X
రెండు అడుగులు ముందుకు పడినట్లే పడి..తీరా చూస్తే మూడు అడుగులు వెనక్కి పడిన చందంగా మారుతున్నాయి కరోనాకు చెక్ పెట్టే చర్యలు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి సంగతి చూసేందుకు వేస్తున్న ఎత్తులేవీ ఫలించటం లేదు. నిన్నటివరకూ పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ ప్రకటన చేసింది. కరోనా నివారణకు ఉన్న మార్గాల్ని అన్వేషిస్తున్న చాలామంది ఒక అంశంపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. కానీ.. అవేమీ కరోనా విషయంలో సాధ్యం కావని తేల్చేశారు.

సాధారణంగా వైరస్ కు చెక్ పెట్టేందుకు యాంటీ బాడీస్ (అదేనండి వ్యాధి నిరోధక శక్తి మూలాలు) సాయం చేస్తాయన్నది బండ రూల్. దీన్నిసాయంగా చేసుకొని కరోనాను జయించిన వారి రక్తంలోని యాంటీ బాడీస్ ను సేకరించటం.. వాటిని కరోనా రోగుల్లోకి ఎక్కించటం ద్వారా మాయదారి వైరస్ ను జయించొచ్చన్న భావనను పలువురు వైద్యులు భావిస్తున్నారు. ఈ విదానంలో కరోనా వైరస్ సోకి.. నయమైన వారికి మళ్లీ కరోనా సోకదన్న ఆలోచనలో ఉండేవారు.

కానీ.. అలాంటి ఆశలు పెట్టుకోవద్దంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా షాకింగ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ నుంచి కోలుకున్న చాలామంది.. తమ యాంటీ బాడీస్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని.. కానీ వారి యాంటీ బాడీస్ ని కరోనా పేషెంట్లకు ఎక్కించటంతో ప్రయోజనం చాలా తక్కువగా ఉందని తేల్చింది. ప్రపంచంలోని పలు దేశాలు యాంటీ బాడీస్ సేకరించే అంశం మీద ఫోకస్ పెట్టిన సమయంలో ఈ బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది.

తాజా ప్రకటనతో యాంటీ బాడీస్ తో కరోనా పీచమణచొచ్చన్న ఆలోచన లో ఉన్న వారి ఆశల మీద బండెడు నీళ్లు పోసినట్లుగా మారింది. ఇదంతా చూసినప్పుడు కరోనాకు సరైన మొగుడు.. దానికి అన్నివిధాలుగా చెక్ పెట్టే వ్యాక్సిన్ రావటం మినహా మిగిలిన ఏ పద్దతితోనూ దాన్ని కట్టడి చేయటం సాధ్యం కాదన్న భావన కలగటం ఖాయం.