Begin typing your search above and press return to search.
ప్రపంచంలోనే నంబర్ 1 తేనే.. రేటు ఎంతంటే?
By: Tupaki Desk | 8 Aug 2019 7:00 AM ISTమన సమాజంలో ఇప్పుడు చక్కెర కొండలు పెరిగిపోతున్నారు. ఫాస్ట్ ఫుడ్, బేకరీల ఫుడ్ తోపాటు స్వీట్లు దండిగా తింటుండడంతో 35 ఏళ్లకే షుగర్ బారిన పడి సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. అందుకే ఇప్పుడు చక్కెరకు ప్రత్యామ్మాయంగా అందరూ ‘తేనె’ను ఎంపిక చేసుకుంటారు చాలా మంది. డాకర్టు కూడా ఇదే సూచిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యానికి ఆరోగ్యంతోపాటు పాటు సహజసిద్ధమైనది కావడం.. రుచిలో మేటి కావడంతో ఇప్పుడు అందరి ఎంపిక ‘తేనె’ అవుతోంది..
తేనె మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. చక్కెర జీవితాన్ని చిదిమేసేది కాగా.. తేనె ఎన్నో ఔషధ గుణాల కలబోత.. ఇందులో మినరల్స్, విటమిన్స్, యాంటి అక్సిడెంట్స్ నిండుగా ఉంటాయి. దీన్ని మంచి ఆహారంగా.. సౌందర్య సాధనంగా.. ఔషధాల తయారీలో కూడా తేనేను విరివిగా వాడతారు.ఇక చక్కెర ఉత్పత్తికి సీజన్ ఉంటుంది. కానీ తేనే ప్రపంచవ్యాప్తంగా సంవత్సరం పొడువునా దొరికే పదార్థం. కానీ చాలా కష్టంతో కూడుకున్న పని ఇదీ..
*తేనే వాడకం భారత్ లో పెరుగుతోంది..
భారత్ లో తేనే వ్యాపారం 2018లో 1560 కోట్లుగా ఉంది. ఏటా 10.2శాతం వృద్ధి నమోదవుతోంది. అయితే ఈ తేనె ఎలా లభిస్తుంది.? అంటే తేనెటీగలతో.. మరి తేనేలో మంచి క్వాలిటీ తేనెలు ఉంటాయా? అంటే ఉంటాయి. ప్రపంచంలో 100కుపైగా రకాల తేనే రకాలున్నాయి. తేనెను వేరు చేస్తే వచ్చే నీరు, పుప్పొడితోనూ ఫుడ్ సప్లిమెంట్స్, బ్యూటీ ప్రాడక్ట్స్, మెడిసిన్స్ తయారు చేస్తుంటారు. మొత్తం తేనే తుట్టెలోని ప్రతీ పదార్థం మనకు ఉపయోగపడేదే..
*తేనె వాడకంలో అమెరికా ఫస్ట్
ఆరోగ్యసంరక్షణకు పెద్దపీట వేసే అమెరికన్లు ప్రపంచంలోనే తేనెను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఆ తర్వాత స్థానంలో యూరప్- చైనా- భారత్- ఆస్ట్రేలియా లో ఎక్కువగా ఉత్పత్తి , వినియోగం ఉంటుంది. భారత్ లోనూ తేనే వాడకం ఎక్కువే.
*భారత్ లోని తేనె బ్రాండ్స్ ఇవే..
భారత్ లోని ప్రముఖ కంపెనీలైన డాబర్- పతంజలి- జండు- ఏపీఎస్- రస్న తదితర బ్రాండ్లు తేనేను ఎక్కువగా కొని వివిధ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నాయి. ఈ తేనే మార్కెట్ వాటా ఏకంగా 1200కోట్లుగా ఉంది. ఇక ఆర్గానిక్ బ్రాండ్లలో ఆర్గానిక్ తత్వ, నేచుర్ ల్యాండ్, ప్రో నేచుర్, 24 లెటర్ మంత్ర వంటి తేనే బ్రాండ్లు మార్కెట్లో ఉన్నాయి.
* ప్రపంచంలోనే నంబర్ 1 తేనే ఇదీ
ఇక ప్రపంచంలో నంబర్ 1 తేనే ఏంటో తెలుసా.? ‘రాయల్ జెల్లీ’. ఈ తేనే కిలో ధర ఏకంగా లక్ష రూపాయలు నుంచి లక్షన్నర దాకా ఉంటుంది.. ఇంత ఖరీదైన ఈ తేనే దేంతో తయారు చేస్తారో తెలుసా? ప్రపంచంలోనే చాలా ఖరీదైన బ్లూబెర్రీ- బ్లాక్ బెర్రీ- మిల్క్ వీడ్- అకేషియా- మనుక- క్లోవర్ వంటి పూల మొక్కల నుంచి తేనే టీగల ద్వారా తేనే సేకరిస్తారు. రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతితో ఈ మొక్కలను పెంచుతారు.. ఇది పూర్తిగా పేస్ట్ మాదిరిగా ఉంటుంది. అందుకే దీనికి అంత రేటు. ఈ తేనే తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే దీన్ని బడా బాబులు ఎక్కువగా వాడుతుంటారు.
*తేనే ఎలా తయారవుతుంది?
తేనే టీగ జీవితకాలం మూడు నుంచి ఆరువారాలు మాత్రమే కావడం విశేషం. సుమారు 10గ్రాముల తేనేను ఒక తేనెటీగ తన జీవితకాలంలో ఉత్పత్తి చేస్తుంది. 40లక్షల పూల నుంచి సేకరించిన మకరందంతో 4 కిలోల తేనెతుట్ట సిద్ధమవుతుంది. దీని నుంచి 1 కిలో తేనె వస్తుంది.