Begin typing your search above and press return to search.

కేసీఆర్ లండన్ కల.. నిజమవుతుందా?

By:  Tupaki Desk   |   31 Dec 2019 4:29 AM GMT
కేసీఆర్ లండన్ కల.. నిజమవుతుందా?
X
అప్పుడెప్పుడో తెలంగాణ వచ్చిన కొత్తలో తనకు సెంటిమెంట్ అయిన కరీంనగర్ లో పర్యటించిన కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం లో తొలి అభివృద్ధి పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించి విశ్వాసం చాటుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఐదేళ్ల క్రితం ‘కరీంనగర్ ను లండన్ లా చేస్తాను.. ఇక్కడ థేమ్స్ నదిలా మానేరు నదిని జీవధార చేసి సస్పెన్షన్ బ్రిడ్జి కడుతానని.. నగరాన్ని సుందరం గా తీర్చిదిద్దుతానని ’ హామీ ఇచ్చారు..

ఐదేళ్లు గడిచింది.. కేసీఆర్ రెండోసారి అధికారం లోకి వచ్చాడు. కరీంనగర్ నగరం లో అభివృద్ధి పనులు అయితే సాగుతున్నాయి. స్మార్ట్ సిటీ పనులు అస్తవ్యస్తంగా రోడ్ల తవ్వకాలున్నాయి. అయితే కేసీఆర్ లండన్ కల మాత్రం నెరవేరుతుండడం విశేషం.

కరీంనగర్ నగరం పక్కనే ఉన్న మానేరు వాగుపై టర్కీ, జర్మనీ సాంకేతిక బృందం టెక్నాలజీ తో టాటా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ లండన్ లో ఉన్న తీగల బిడ్జిని ఇక్కడా కడుతోంది. ఇప్పుడు ఆ బ్రిడ్జి దాదాపు 70శాతం పూర్తయ్యింది. ఆధారం లేకుండా తీగల బ్రిడ్జి పై రోడ్ పిల్లర్లను అమర్చేశారు. వచ్చే మేలోగా తీగల బ్రిడ్జి రెడీ.. కేసీఆర్ కల నిజమవుతుంది. అయితే ఈ బ్రిడ్జి వరకూ మానేరు రివర్ ఫ్రంట్ పెట్టి నీటిని ఆపి థేమ్స్ నదిని గుర్తు చేసే పని మాత్రం ఇంకా మొదలు కాలేదు.

నిన్న కరీంనగర్ లో పర్యటించిన కేసీఆర్.. ‘తన లండన్ కల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. కొందరు కరీంనగర్ నగర్ ను లండన్ లా చేస్తానంటే వెకిలిగా నవ్వుతున్నారని.. ఇప్పుడు ఏంమంటారంటూ ప్రశ్నించారు..

మొత్తానికి కేసీఆర్ హామీనిచ్చిన 5 ఏళ్లకు తీగల బ్రిడ్జి పనులు పూర్తికావస్తున్నాయి.. ఇంకా చాలా పనులున్నాయి.. కేసీఆర్ కల పూర్తిగా నెరవేరాలంటే కనీసం ఏడాది అవుతుంది. అప్పుడు కానీ ఆయన కల నెరవేరిందని చెప్పాలి..