Begin typing your search above and press return to search.
ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2022లోనూ ఇంటి నుంచే పని!
By: Tupaki Desk | 23 Dec 2021 12:19 PM ISTరోజూ ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లి.. తిరిగి ఇంటికి చేరటం మహానగరాల్లో చాలా కష్టమైన పని. ప్రయాణం కోసమే తక్కువలో తక్కువ గంట నుంచి మూడు..నాలుగు గంటల వరకు ప్రయాణించే వారెందరో. అలాంటి వారి చిక్కుల్ని పక్కకు పడేసింది మాయదారి కరోనా. ఈ మహమ్మారి ఎంట్రీతో ఆఫీసుకు వెళ్లి పని చేసే స్థానే.. ఇంటి నుంచి పని చేసే అలవాటు ఒక్క ఐటీ ఉద్యోగులే కాదు.. వివిధ రంగాలకు చెందిన వారు చేస్తున్నారు. దాదాపుగా ఏడాదిన్నరకు పైనే ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగుల్ని.. ఈ మధ్యనే ఆఫీసులకు వచ్చి పని చేయాలని కంపెనీలు చెబుతున్నాయి.
అయితే.. ఈ ఏడాదిలో ఎందుకు.. ఎంచక్కా 2022 జనవరి మధ్య నుంచి కానీ ఫిబ్రవరి నుంచి కానీ పక్కాగా ఆఫీసులకు వచ్చి పని చేయాలని వివిధ కంపెనీలు గతంలో తమ ఉద్యోగులకు సూచనలు చేశాయి. కొన్ని కంపెనీలు మాత్రం.. 2022 మధ్య వరకు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి. ఉద్యోగులు తమ ఆఫీసులకు వెళ్లే టైం దగ్గరకు వస్తున్న వేళ.. ఒమిక్రాన్ రూపంలో కొత్త బెడద మొదలైంది. దీంతో.. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు తీసుకొచ్చే విషయంపై పునరాలోచనలో పడ్డాయి. ఇప్పటికే టీసీఎస్ అధికారికంగా వచ్చే ఏడాది మధ్య వరకు తమ ఉద్యోగుల్ని ఇంటి నుంచే పని చేయిస్తామని చెప్పటం తెలిసిందే.
ఐటీ ఉద్యోగుల్లో దాదాపు 90 శాతం రెండు వ్యాక్సినేషన్ల డోసులు పూర్తి చేసుకున్నాయి. అయితే.. కొత్త వేరియంట్ వ్యాక్సిన్లు వేసుకున్న వారిని సైతం వదలకపోవటం.. మిగిలిన వేరియంట్లతో పోలిస్తే.. మహా వేగంగా విస్తరించటంతో తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు వచ్చి పని చేసే కన్నా.. ఇంటికే పరిమితం కావటం మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వచ్చే ఏడాది మొదట్లోనే ఆఫీసులకు రావాలని ఇప్పటికే సమాచారం ఇచ్చిన కంపెనీలు.. మరో వారం వ్యవధిలో కొత్త సందేశాన్ని కమ్యునకేట్ చేస్తారని చెబుతున్నారు.
ఇప్పటివరకు సేకరించిన సమాచారం ప్రకారం.. ఒమిక్రాన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి.. మార్చిలో భారత్ లో పెద్ద ఎత్తున వ్యాపిస్తుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో.. ఈ వేరియంట్ ప్రభావం ఏమేరకు ఉంటుందన్న విషయంపై స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే.. తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు పిలుస్తామని చెబుతున్నారు. ఒకవేళ ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువ ఉంటే.. వచ్చే ఏడాది మొత్తం ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాల్సి ఉంటుంది.
అందుకు భిన్నంగా ఒమిక్రాన్ తీవ్రత తక్కువ ఉన్న పక్షంలో 2022 మధ్య భాగం నుంచి ఉద్యోగుల్ని ఆఫీసులకు రమ్మని చెప్పొచ్చన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఒమిక్రాన్ తర్వాత.. మరే వేరియంట్ అయినా కొత్తది వచ్చే అవకాశాన్ని తోసిపుచ్చలేం. సో.. 2022లో దాదాపు ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువమంది ఇంటి నుంచే పని చేసేలా కంపెనీలు నిర్ణయాన్ని తీసుకునే వీలుందంటున్నారు.