Begin typing your search above and press return to search.

క‌రెంట్ ఎఫైర్ : మాట‌ల యుద్ధంలో గెలిచేదెవ్వ‌రు? బొత్స వెర్స‌స్ అచ్చెన్న

By:  Tupaki Desk   |   19 Feb 2022 11:30 AM GMT
క‌రెంట్ ఎఫైర్ : మాట‌ల యుద్ధంలో గెలిచేదెవ్వ‌రు? బొత్స వెర్స‌స్ అచ్చెన్న
X
ఏపీ క్యాబినెట్ లో విద్యుత్ వివాదాలు ప్ర‌కంప‌నాలు రేపుతున్నాయి. ఇదే స‌మ‌యంలోటీడీపీ కూడా ఇదే వివాదాన్ని కొన‌సాగించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. గ్రామాల్లో కోత‌లు అన‌ధికారికంగా అమ‌లు అవుతున్నాయ‌న్న‌ది టీడీపీ మాట. అయితే కోత‌లే లేవ‌ని త‌నతో వ‌స్తే అన్నింటినీ నిరూపిస్తామ‌ని వైసీపీ అంటోంది.

వాద ప్ర‌తివాదాల నేప‌థ్యంలో ఎన్న‌డూ లేని మంత్రి బొత్స త‌న స్నేహితుడు లాంటి అచ్చెన్న‌పై విరుచుకుప‌డ్డారు.ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో...

చాలా రోజుల త‌రువాత టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడికి బొత్స స‌వాలు విసిరారు.తాము అబ‌ద్ధాలు చెప్పం అని, మోసాలు చేయం అని చెప్పారు.విద్యుత్ కోత‌ల విషయ‌మై టీడీపీవి అన‌వ‌స‌ర,అర్థ‌ర‌హిత ఆరోప‌ణ‌లు అని అన్నారు.

గ‌త కొద్ది రోజులుగా టీడీపీ ఆరోప‌ణ‌లు చూస్తున్నామ‌ని, తాము త‌ప్పు మాట్లాడితే త‌ల దించుకుంటామ‌ని అంటూ అచ్చెన్నాయుడు తో స‌హా ఇత‌ర టీడీపీ నాయ‌కుల‌ను టార్గెట్ చేస్తూ బొత్స మాట్లాడారు.తాము క‌ట్టించిన ఇళ్లు పిచ్చుక గూళ్ల‌లా ఉన్నాయ‌ని చంద్ర‌బాబు ఆరోపిస్తున్నార‌ని, తాము ఏనాడూ త‌ప్పుడు మాటలు చెప్ప‌బోమ‌ని ఏమ‌న్నా అంటే త‌ల‌దించుకుంటామ‌ని అంటున్నారాయ‌న.

ఇక జ‌న్మ‌భూమి కమిటీల‌ను సైతం ఆయ‌న టార్గెట్ చేశారు.ఆ రోజు జ‌న్మ‌భూమి క‌మిటీల పేరిట దోచుకుని తిన్నారని అన్నారు.తాము ఇంటి నిర్మాణానికి ఐదు ల‌క్ష‌లు ఇస్తామ‌ని ఎక్క‌డా చెప్ప‌లేద‌ని కూడా అన్నారు.

ఇంకా టీడీపీని టార్గెట్ చేస్తూ గ‌తంలో జ‌రిగిన త‌ప్పిదాల‌న్నింటినీ తాము స‌వ‌రిస్తున్నామ‌ని అన్నారు.లేని పోనివి ఏవో మాట్లాడి వివాదం సృష్టిస్తున్నార‌ని ఇది త‌గ‌ద‌ని కూడా అన్నారు. అస‌త్య ఆరోప‌ణ‌లు ప్ర‌భుత్వం పై చేయ‌డం త‌గ‌దని కూడా అన్నారు.