Begin typing your search above and press return to search.

ఏపీ సర్కారుకు భారీ డ్యామేజ్ గా మారిన కేంద్రమంత్రి మాటలు

By:  Tupaki Desk   |   11 Dec 2021 11:30 AM IST
ఏపీ సర్కారుకు భారీ డ్యామేజ్ గా మారిన కేంద్రమంత్రి మాటలు
X
ఇటీవల కాలంలో జగన్ సర్కారుకు ఏదీ కలిసి రావటం లేదు. ఏ నిర్ణయాన్ని తీసుకున్నా.. అది ఏదోలా నెగిటివ్ గా మారటం.. ప్రచార మాధ్యమాల్లోనూ అదో హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మైలేజీ కంటే కూడా డ్యామేజే ఎక్కువగా ఉంటోందన్న మాట వినిపిస్తోంది.

ఇలాంటివేళ.. మరో ఇబ్బందికర పరిస్థితి తాజాగా ఎదురైంది. శుక్రవారం రాజ్యసభలో ఇద్దరు సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చే క్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చిత్రమైన పరిస్థితి నెలకొని ఉన్నట్లుగా వ్యాఖ్యానించారు.

ఏపీ డెవలప్ మెంట్ కోసం కేంద్రం కట్టుబడి ఉందని.. రాష్ట్రంలో పారిశ్రామిక వ్రద్ధి కోసం నిరంతరం కొత్త ప్రాజెక్టులను తీసుకొస్తున్నట్లు చెప్పారు. ‘‘పలు ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేస్తున్నాం. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం సమర్థమైన చర్యలు తీసుకున్నప్పుడే మేం వాటిని అమల్లోకి తీసుకురాగలం. భూసేకరణతో పాటు.. ఆ భూమి అంతా ఒకేచోట ఉండేలా చూసినప్పుడే డెవలప్ మెంట్ పనులు ముందుకు సాగుతాయి’’ అని వ్యాఖ్యానించారు.

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నలకు ఆయన రాజ్యసభలోె సమాధానం ఇస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో ఓర్వకల్లు నోడ్ ను 10వేల ఎకరాలతో డెవలప్ చేయాలని ప్రతిపాదిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రెండుగా విభజించి అందులో సగం భూమి మాత్రమే ఇస్తామని.. మిగిలిన సగాన్నితామే డెవలప్ చేసుకుంటామని చెబుతోందన్నారు.

క్రిష్ణపట్నం నోడ్ డెవలప్ మెంట్ కోసం రాష్ట్రం తలపెట్టిన టెండరింగ్ ప్రక్రియపై పలువురు కాంట్రాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా చెప్పారు. ఏపీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే వాటిని అమల్లోకి తీసుకురాగలమని.. భూసేకరణతో పాటు.. ఆ భూమి అంతా ఒకే చోట ఉండేలా చూసుకున్నప్పుడే డెవలప్ అవుతుందన్నారు.

దీనికి ఉదాహరణగా ఆయన కీలకాంశాల్ని ప్రస్తావించారు. ‘‘చెన్నై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లోక్రిష్ణపట్నం నోడ్ తీసుకుంటే దానికి 2500 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు 2091 ఎకరాలు సేకరించారు. ఇది మంచి పరిణామం. అందులో కొంత భూమిని మార్చిలో.. మరికొంత ఆగస్టులో బదిలీ చేశారు.

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పనుల కోసం కాంట్రాక్టర్ ను నియమించాలి. కేంద్రం ఈ విషయాన్ని జోక్యం చేసుకోవాలి. కాంట్రాక్టర్ నియామకానికి ఉత్తమ టెండరింగ్ ప్రక్రియను అనుసరించాలి. ఇప్పుడున్న టెండరింగ్ ప్రక్రియపై చాలామంది కాంట్రాక్టర్లు అభ్యంతరం చేసినట్లు తెలిసింది’ అని వ్యాఖ్యానించారు.

చిన్న ప్రాజెక్టులకు పెద్ద పరిశ్రమలను ఆహ్వానించటం చాలా కష్టమని.. రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించటం చాలా ముఖ్యమన్నారు. అప్పుడే ఇలాంటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయటానికి వీలుంటుందన్నారు. ఏపీలో చాలా చిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఓర్వకల్లులో 10వేల ఎకరాలతో ఒక ప్రాజెక్టుకు ప్రణాళిక రూపొందించి.. ఇప్పుడు దాన్ని రెండు భాగాలుగా కోసి అందులో మీకు సగమే ఇస్తామని చెప్పటం ఏమిటి? మిగిలిన సగం తామే సొంతంగా డెవలప్ చేసుకుంటామని చెబుతున్నారు.

ఇక్కడ పనుల డూప్లికేషన్ జరగనుంది. ఇప్పుడు రెండు పారిశ్రామిక ప్రాజెక్టుల మధ్య పోటీ నెలకొందని.. అందుకే మొదట ప్రతిపాదించినట్లుగా ప్రాజెక్టును ఉంచాలని కోరుతున్నారు. మొత్తంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఈ వ్యాఖ్యలు జగన్ సర్కారుకు ఇబ్బందికరంగా మారతాయన్న మాట వినిపిస్తోంది.