Begin typing your search above and press return to search.
తెలంగాణ రాజ్‌భవన్ లో రోజా సందడి.. కారణం ఏంటంటే !
By: Tupaki Desk | 5 March 2020 11:16 AM ISTనగరి వైసీపీ ఎమ్మెల్యే , సినీ నటి రోజా ..అటు రాజకీయాల పరంగాను , సినిమా రంగం పరంగాను ఫుల్ బిజీగా ఉంటారు. అలాగే సమయం ఉన్నప్పుడల్లా పలు వేదికపై మహిళల గురించి స్పీచులు ఇస్తుంటారు. ఏపీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న రోజా ..సమాజంలో మహిళలపై జరిగే అన్యాయాలపై ఎప్పుడూ తన గళం వినిపిస్తూనే ఉంటుంది. ఇకపోతే తాజాగా ఎమ్మెల్యే రోజా తెలంగాణ రాజ్ భవన్ లో సందడి చేసారు. ఏపీ ఎమ్మెల్యే అయిన రోజా కి , తెలంగాణ రాజ్ భవన్ లో పనేముంటుంది అని అనుకుంటున్నారా? రోజా తెలంగాణ రాజ్ భవన్ కి ..ఆమె సొంత పని మీద రాలేదు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవానికి ఏపీ తరఫున వైసీపీ ఎమ్మెల్యే అయిన ఆర్ కే రోజా హాజరయ్యారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం నాడే రాజ్ భవన్ లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరైయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రోజా , తెలంగాణ మహిళా మంత్రులతో, గవర్నర్ తో సెల్ఫీలు దిగుతూ సందడి చేసారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు తమిళి సై సౌందరరాజన్ అవార్డులను అందజేశారు. షటిల్ స్టార్ పీవీ సింధు, పరిశోధకురాలు జ్యోతి గౌడ, మహిళా రైతు బీ లక్ష్మమ్మ, జానపద గాయని కనకవ్వ, టాప్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎస్వీ కామేశ్వరి, గ్రామీణ విలేకరి గంగవ్వ, యోగా గురు అరుణాదేవి, క్రీడాకారిణి నికత్ జరీన్ తదితరులకు గవర్నర్ అవార్డులను అందజేశారు.
తాను గవర్నర్ గా పని చేసినంత కాలం ఏటేటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తానని, గుర్తింపు పొందని మహిళా నిష్ణాతులను గౌరవించడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు గవర్నర్ తమిళి సై తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారనడానికి గంగవ్వ, జ్యోతి గౌడ, లక్ష్మమ్మ నిదర్శనమని అన్నారు