Begin typing your search above and press return to search.

టార్చర్ పెట్టే భర్త కట్ చేసి పడేసింది.. ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   28 Sept 2022 10:23 AM IST
టార్చర్ పెట్టే భర్త కట్ చేసి పడేసింది.. ఎక్కడంటే?
X
నిద్ర లేచిన భార్య శోకాలు పెడుతూ.. తన భర్తను అత్యంత దారుణంగా హతమార్చినట్లుగా పేర్కొంటూ కన్నీరు మున్నీరు పెట్టుకున్న ఉదంతం ఒకటి ఛత్తీస్ గఢ్ లో సంచలనంగా మారింది. దీనికి కారణం.. సదరు వ్యక్తిని ఎవరో కసిగా హతమార్చిన ఆనవాళ్లు ఉండటమే.

శరీరం మీద పెద్ద ఎత్తున గొడ్డలి పోట్లతో పాటు.. అతడి పురుషాంగాన్ని సైతం కట్ చేసి పడేసిన వైనం పోలీసుల్ని సైతం నిర్ఘాంతపోయేలా చేసింది.

ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ జిల్లాలోని అమలేశ్వర్ గ్రామానికి చెందిన వ్యక్తి (అనంత్ సోన్వానీ) హత్య సంచలనంగా మారింది. దీంతో.. ఈ హత్య ఉదంతాన్ని సవాలుగా చేసుకున్న పోలీసులు.. తమదైన కోణంలో చూశారు.

పలు సందేహాలు వారి మదిలో మెదిలాయి. విచారణలో భాగంగా అనంత్ సతీమణి సంగీతను పలు ప్రశ్నలు వేశారు. ఒకదానితో మరొకటి సంబంధం లేని సమాధానాలు ఇవ్వటంతో ఆమెను అనుమానించారు.

చివరకు మరింత గట్టిగా ప్రశ్నించేసరికి.. అసలేం జరిగిందన్న విషయాన్ని బయటపెట్టేసింది. తాను నల్లగా ఉన్నానని.. తన శరీరంపై మచ్చలు ఉన్న విషయాన్ని తరచూ ప్రస్తావిస్తూ.. తనకు నిత్యం నరకం చూపించేవాడని భర్త గురించి చెప్పి వాపోయింది. తరచూ ఈ విషయాల మీద భర్త ప్రవర్తన టార్చర్ గా మారిందన్నారు. ఆదివారం రాత్రి కూడా ఇదే అంశం మీద పెద్ద గొడవ జరిగిందని.. భర్త పడుకున్న తర్వాత గొడ్డలి తీసుకొని దాడి చేసినట్లుగా చెప్పింది.

శరీరం మీద విచక్షణ రహితంగా వేట్లు వేయటంతో పాటు.. అతడి పురుషాంగాన్ని సైతం కట్ చేసేసింది. తర్వాత తనకేం తెలీనట్లుగా నిద్ర పోయింది. పక్క రోజు ఉదయం.. తన భర్తను ఎవరో దారుణంగా చంపేసినట్లుగా ఏడుస్తూ తాను చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునే నాటకానికి తెర తీసింది. పోలీసుల ఎంట్రీతో మర్డర్ మిస్టరీని తేల్చేశారు. మోతాదు మించిన టార్చర్ కారణంగానే తానీ పని చేసినట్లుగా ఆమె పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.